Sunday, July 13, 2025
Homeటెక్నాలజీOPPO Pad SE Launched: బిగ్ బ్యాటరీ, అదిరే ఫీచర్లతో OPPO Pad SE విడుదల..ధర...

OPPO Pad SE Launched: బిగ్ బ్యాటరీ, అదిరే ఫీచర్లతో OPPO Pad SE విడుదల..ధర కేవలం రూ. 12,999

OPPO Pad SE Launched: OPPO తాజా టాబ్లెట్ OPPO Pad SE ఇండియాలో అధికారికంగా లాంచ్ అయింది. మీరు తక్కువ ధరలో టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కొత్త OPPO Pad SE మీకు సరైన ఆప్షన్ కావచ్చు. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ట్యాబ్ లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ OPPO Reno 14, OPPO Reno 14 Pro స్మార్ట్‌ఫోన్‌లతో పాటు దీనిని విడుదల చేసింది. కాగా, మొదటి సేల్‌లో ఈ టాబ్లెట్ రూ. 12,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ధర

OPPO Pad SE మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. 4జీబీ+ 128జీబీ Wi-Fi మోడల్ ధర రూ. 13,999గా పేర్కొంది. ఇక 6జీబీ+128జీబీ LTE మోడల్ ధర రూ.15,999గా, 8జీబీ+128జీబీ LTE మోడల్ ధర రూ. 16,999గా నిర్ణయించింది. అయితే ఇది రెండు రంగులలో అందుబాటులో ఉంది. స్టార్‌లైట్ సిల్వర్, ట్విలైట్ బ్లూ.

ఈ ట్యాబ్ సేల్స్ జూలై 8 నుండి ప్రారంభమవుతుంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ట్యాబ్ రూ. 1,000 కూపన్ తగ్గింపు తర్వాత రూ. 12,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్‌లో ఎంపిక చేసిన ఒప్పో బ్రాండ్ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు.

ఫీచర్లు

ఈ టాబ్లెట్ 11-అంగుళాల LCD ఐ-కేర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. OPPO Pad SE టాబ్లెట్ ఫ్లికర్-ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ పనితీరు కోసం.. TÜV రీన్‌ల్యాండ్ ద్వారా డ్యూయల్-సర్టిఫై చేశారు. ఈ ట్యాబ్‌లో MediaTek Helio G100 ప్రాసెసర్, Arm Mali-G57 MC2 తో అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ColorOS 15.0.1 పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. ఈ ట్యాబ్ 5-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 1080 పిక్సెల్స్ వద్ద 30 fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ట్యాబ్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక బ్యాటరీ గురుంచి చెప్పాలంటే..ఈ ట్యాబ్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9340mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం దీనికి USB టైప్-C పోర్ట్ ఉంది. పూర్తి ఛార్జ్‌లో ఇది 11 గంటల ఆన్‌లైన్ మూవీ ప్లేబ్యాక్ సమయాన్ని, 80 గంటల ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.

కనెక్టివిటీ కోసం 4G LTE (ఐచ్ఛికం), Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. శక్తివంతమైన ధ్వని కోసం ఇది క్వాడ్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ట్యాబ్ బరువు 530 గ్రాములు (ప్రామాణికం), 527 గ్రాములు (సాఫ్ట్ లైట్). దీని కొలతలు 254.91×166.46×7.39 mm.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News