Saturday, November 15, 2025
Homeటెక్నాలజీOffers sale: ఆఫర్లో కొందామంటే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ చూపిస్తుందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌తో మీకు...

Offers sale: ఆఫర్లో కొందామంటే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ చూపిస్తుందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌తో మీకు నచ్చింది కొనేయండి

Out Of Stock in Amazon, Flipkart sale: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్లు బంపరాఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే, బుక్‌ చేసుకుందాం అనేలోపే స్టాక్‌ అయిపోతుంటుంది. దీంతో, తక్కువ ధరకు వచ్చే వస్తువులు సెకన్లలోనే ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అని కనిపిస్తుంటుంది. ఇది చాలా మందికి నిరాశ కలిగిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ఈ-కామర్స్ సైట్లలో మీకు ఇష్టమైన వస్తువులు సక్సెస్ ఫుల్‌గా కొనుగోలు చేయడానికి కొన్ని ఈజీ టిప్స్‌ పాటించాలి. అవేంటో చూద్దాం.

- Advertisement -

అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ చూపిస్తుందా?.. ఇలా చేయండి

1.ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ తీసుకోండి

ఫ్లిప్‌కార్ట్ (ప్లస్ మెంబర్‌షిప్), అమెజాన్ (ప్రైమ్ మెంబర్‌షిప్) వంటి ప్లాట్‌ఫామ్‌లు తమ ప్రీమియం సభ్యులకు సేల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ‘ఎర్లీ యాక్సెస్’ అవకాశాన్ని కల్పిస్తాయి. స్టాక్‌ను ముందుగా ఎక్స్‌క్లూజివ్‌ మెంబర్లకు అందుబాటులోకి తెస్తాయి. అందుకే, ఆఫర్‌ను ముందుగా పట్టేయాలంటే ఎక్స్‌క్లూజివ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలి.

2. అడ్రస్, పేమెంట్ వివరాలు రెడీగా ఉంచుకోవాలి

సేల్ ప్రారంభానికి ముందే మీ షిప్పింగ్ అడ్రస్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా యూపీఐ వివరాలను అకౌంట్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. ఫుల్‌ డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులను బుకింగ్‌ చేసుకునే క్రమంలో ప్రతి సెకను కీలకం. అందుకే, బుకింగ్‌ ప్రాసెన్‌ను ఆలస్యం చేయకుండా ఉండాలంటే అన్ని వివరాలు ముందుగానే ఫిలప్‌ చేయాలి. తద్వారా నేరుగా ఆర్డర్ ప్లేస్ చేసేందుకు ఇది సహాయపడుతుంది.

3. ‘విష్‌లిస్ట్’ లేదా ‘కార్ట్’‌లో ఉంచండి

మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులను ముందుగానే ‘విష్‌లిస్ట్’ లేదా ‘కార్ట్’లో చేర్చండి. సేల్ మొదలవగానే, నేరుగా కార్ట్ నుంచి పేమెంట్ ప్రక్రియను ప్రారంభించండి. తద్వారా సమయం ఆదా అవుతుంది.

4. స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్

మీ ఇంటర్నెట్ స్పీడ్‌ ఎక్కువగా ఉంటే వెబ్‌సైట్ లేదా యాప్‌లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయి. ముఖ్యంగా ‘ఫ్లాష్ సేల్’ లేదా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండే సమయంలో పేజ్‌మీద లోడ్‌ ఎక్కువ పడుతుంది. ఈ సమయంలో తొందరగా పేజ్‌ ఓపెన్‌ కావడానికి ఇంటర్నెట్‌ స్పీడ్‌ను పెంచండి.

5. సేల్ ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉండండి

డీల్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలుసుకుని, దానికి కనీసం 5 నిమిషాల ముందుగా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండండి. సేల్ మొదలైన వెంటనే వెంటనే ‘బై నౌ’పై క్లిక్‌ చేయండి. ఒకవేళ ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అని చూపించినా, కొద్ది సెకన్లు లేదా నిమిషాలు వేచి ఉండి పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి. కొందరు యూజర్లు ఆర్డర్‌ను రద్దు చేయడం వల్ల స్టాక్ మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా, మీకు నచ్చిన ఉత్పత్తులను భారీ ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad