Sunday, September 8, 2024
Homeటెక్ ప్లస్Pak: వికీపీడియాను బ్లాక్ చేసిన పాకిస్థాన్

Pak: వికీపీడియాను బ్లాక్ చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ దేశ వికీపీడియాను బ్లాక్ చేసింది. బ్లాస్పెమీ అంటే దైవదూషణకు సంబంధించిన కంటెంట్ ను వికీపీడియా తొలగించలేదనే అక్కసుతో పాక్ ఈ పని చేసింది. ఈనెల 1వ తేదీన పాకిస్థాన్ దేశలో ఉన్నట్టుండి వికీపీడియా సేవలు నిలిచిపోయాయి. తొలుత 48 గంటలపాటు నిషేధం విధించిన పాక్ ఆతరువాత కూడా మళ్లీ ఆ సైట్ ను బ్లాక్ చేసింది. ఈమేరకు పాకిస్థఆన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ సంబంధిత సైట్ ను బ్లాక్ చేసినట్టు అధికారికంగా ట్వీట్ చేసింది. ఆతరువాత పీటీఏ అధికారులతో వికీపీడియా చర్చలు జరిపినా ఫలితం మాత్రం లేకపోయింది. తమ దేశంలోని చట్టాలను ఉల్లంఘించేలా వికీలో సమాచారం ఉందని దాన్ని తొలగించలేదని పీటీఏ ఆగ్రహం వ్యక్తంచేసింది.

- Advertisement -

కొసమెరుపు ఏమిటంటే వికీలో సెన్సార్షిప్ ఆఫ్ వికీపీడియా అనే ఓ ఆర్టికల్ ఉంది. ఇందులో చైనా, ఇరాన్, మయాన్మార్, రష్యా, సౌదీ అరేబియా, సిరియా, తునీషియా, టర్కీ, ఉజ్బెకిస్తాన్, వెనిజూలా వంటి దేశాల్లో వికీని బ్యాన్ చేయటాన్ని పూర్తిగా వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News