PhonePe : ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే సామాన్యులకు అందుబాటులో ఉండే గృహ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. కేవలం రూ.181 (జీఎస్టీతో సహా) వార్షిక ప్రీమియంతో ఇల్లు, ఇంట్లోని విలువైన వస్తువులకు రక్షణ కల్పించే ఈ పాలసీని ఫోన్‌పే యాప్ (PhonePe App)లో సులభంగా పొందవచ్చు. రూ.10 లక్షల నుంచి రూ.12.5 కోట్ల వరకు కవరేజ్ ఎంచుకోవచ్చు. అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు, దొంగతనం, అల్లర్లతో సహా 20కి పైగా నష్టాల నుంచి ఈ బీమా ఆర్థిక భద్రత అందిస్తుంది. గృహ రుణం ఉన్నా, లేకపోయినా అందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంది.
ALSO READ: Doctor Jobs: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 185 డాక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ఈ పథకం ఇంటి నిర్మాణంతో పాటు ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాల వంటి విలువైన ఆస్తులను కూడా కవర్ చేస్తుంది. ఎలాంటి తనిఖీలు, క్లిష్టమైన పత్రాల ప్రక్రియ లేకుండా, ఫోన్‌పే యాప్‌లో కొన్ని నిమిషాల్లో పాలసీని పొందవచ్చు. వినియోగదారులు తమ ఇంటి వివరాలు నమోదు చేసి, కావాల్సిన కవరేజ్ ఎంచుకోవడం ద్వారా తక్షణమే బీమా పొందవచ్చు. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ పాలసీని గృహ రుణాల కోసం అంగీకరిస్తాయని ఫోన్‌పే స్పష్టం చేసింది.
ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ, “భారతీయుల గృహ స్వప్నాన్ని కాపాడేందుకు మేం కట్టుబడి ఉన్నాం. తక్కువ ఖర్చుతో, సులభంగా అందుబాటులో ఉండే ఈ బీమా పథకం ఆ దిశగా ముందడుగు. సాంప్రదాయ గృహ బీమా పాలసీలు ఖరీదైనవి, పరిమితులతో ఉంటాయి. మేం ఆ సమస్యలను అధిగమించాం” అని పేర్కొన్నారు. జులై 2025 నాటికి ఫోన్‌పేకు 64 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 4.5 కోట్ల మర్చంట్ నెట్‌వర్క్ ఉన్నాయి. ఈ బీమా పథకం గృహ యజమానులకు ఆర్థిక భద్రతను సులభతరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం భారత బీమా రంగంలో కీలక మార్పును తీసుకొస్తుందని అంచనా.


