Saturday, November 15, 2025
Homeటెక్నాలజీPiaggio Electric Auto: పియాజియో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు..ధరెంతో తెలుసా..?

Piaggio Electric Auto: పియాజియో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు..ధరెంతో తెలుసా..?

Piaggio Electric Auto Launched: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను అనేక గొప్ప ఫీచర్లతో పాటు లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌తో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Piaggio Ape E-City Ultra

ఇది సరికొత్త ఏప్ ఇ-సిటీ అల్ట్రా ఎలక్ట్రిక్ ఆటో. ఇది 10.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 236 కి.మీ వరకు నడపవచ్చు. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారు 9.55 kW పవర్, 40 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 28% గ్రేడబిలిటీ, క్లైమ్ అసిస్ట్ మోడ్, 3 kW ఛార్జర్‌తో ఫాస్ట్-ఛార్జింగ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఆటో ఇంటెలిజెంట్ టెలిమాటిక్స్, లైవ్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డిజిటల్ స్పీడోమీటర్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Also Read: Electric Scooters: సింగల్ ఛార్జ్ తో 150 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Piaggio Ape E-City FX Maxx

ఈ ఎలక్ట్రిక్ ఆటోకి 8.0 kWh బ్యాటరీ అందించారు. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 174 కి.మీ వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇందులో అమర్చిన మోటారు 7.5 kW శక్తిని, 30 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 19% గ్రేడబిలిటీని కలిగి ఉంది.

 

ధర ఎంత?

ఏప్ ఈ-సిటీ అల్ట్రా భారతదేశంలో రూ. 3.88 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కంపెనీ కొనుగోలుదారులకు 5 సంవత్సరాలు లేదా 2,25,000 కి.మీ వారంటీని కూడా అందిస్తోంది. మరోవైపు..ఏప్ ఈ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ భారతదేశంలో రూ. 3.30 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad