Poco C85 5G smartphone Release in Indian Market: భారతీయ మార్కెట్‌లోకి పోకో సీ85 5జీ ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ నేడు (డిసెంబర్ 9) మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. కాగా, గత కొద్ది రోజులుగా ఈ హ్యాండ్‌సెట్‌పై భారీ హైప్ నెలకొంది. బడ్జెట్ 5జీ కేటగిరీలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ వంటివి అందించింది.
ప్రీమియం లుక్, లైట్ వెయిట్..
పోకో సి85 స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే స్లీక్ బాడీ ట్రెండీ డ్యూయల్ టోన్ కలర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm థిక్‌నెస్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్లిమ్ ప్రొఫైల్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఈ డిజైన్ యువతను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసింది. ఫోన్ చూడటానికి పెద్దగా అనిపించినా, చేతిలోకి తీసుకుంటే లైట్ వెయిట్‌గా ఉంటుందని, ఇది యూజర్‌కు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపింది. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్, గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక, డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.9 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లేని అందించారు. ఈ భారీ డిస్‌ప్లే అత్యంత స్మూత్ బెజెల్స్, ముందు వైపు సెల్ఫీ కోసం ప్రత్యేకంగా వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లేను అందించింది. స్క్రోలింగ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఫెసిలిటీ కల్పించింది. హై రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల, సినిమాలు చూడటానికి, సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి, గేమ్ ఆడేందుకు ఎలాంటి లాగ్ లేకుండా అద్భుతంగా పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ, హైఎండ్ కెమెరా..
ఈ ఫోన్ భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీనిలోని 6000mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ కూడా ఆగకుండా పనిచేస్తుంది. ఛార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో సగం రోజుకు సరిపోయేంత పవర్‌ను పొందవచ్చు. అత్యవసర సమయాల్లో ఇతర ఫోన్లకు పవర్ షేర్ చేయడానికి రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50 ఎంపి కెమెరా ముందువైపు 8 ఎంపి సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ సెటప్ రోజువారీ ఫోటోలు, వీడియో కాల్స్, రీల్స్ సోషల్ మీడియా పోస్టింగ్‌లకు సరిగ్గా సరిపోతుంది. ఈ కెమెరా స్టిల్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని, మంచి బ్రైట్‌నెస్‌తో కూడిన షాట్‌లను తీయగలదు. ఈ ఫోన్‌లో మీడియటేక్ డైమెంసిటీ 6300 ప్రాసెసర్‌ను అందించింది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. స్టోరేజీని పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. దీనిలో డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్, లౌడ్ స్పీకర్, 3.5mm ఆడియో జాక్ వంటి అదనపు ఫీచర్లను అందించింది.
ఇండియాలో ధర ఎంతంటే?
ఇక, ధర విషయానికి వస్తే.. పోకో C85 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12 వేల నుంచి రూ.13 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అల్ట్రా మోడ్రన్ ఫీచర్ల కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.

