Poco F7 5G launched: పోకో తన ఎఫ్-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. పోకో ఎఫ్7 5జీలో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, 50 ఎంపీ ప్రైమరీ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పోకో ఎఫ్7 5జీ ఇండియన్ వేరియంట్‌లో 7550mAh బ్యాటరీతో రిలీజ్ అయింది. మిడ్ రేంజ్ లో బిగ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న టెక్ ప్రియులు దీని పరిశీలించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురుంచి వివరంగా తెలుసుకుందాం.
ధర
పోకో ఎఫ్7 5జీ స్మార్ట్‌ఫోన్ 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 31,999గా, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ. 33,999గా నిర్ణయించారు. ఈ హ్యాండ్‌సెట్ జూలై 1 నుండి ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తోంది.
ఫీచర్లు
పోకో ఎఫ్7 5జీ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల 1.5 కె (1,280×2,772 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. డిస్ప్లే 3200 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌కు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే బిగ్ 7550mAh బ్యాటరీ ని అందించారు. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP66+IP68+IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్ 2.0 తో నడుస్తుంది. వస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు OS అప్‌గ్రేడ్‌లను, 6 సంవత్సరాల వరకు భద్రతా అప్‌గ్రేడ్‌లను పొందుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా..ఈ ఫోన్ లో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లతో పాటు.. AI నోట్స్, AI ఇంటర్‌ప్రెటర్, AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, AI ఇమేజ్ ఎక్స్‌పాన్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరా గురించి మాట్లాడితే..పోకో ఎఫ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ రియర్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ఉంది. ఫోన్‌లో అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉన్నాయి. ఇక కనెక్టివిటీ కోసం.. 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పరికరం 222 గ్రాముల బరువు, 7.98mm మందం ఉంటుంది.