Discount: ఈరోజుల్లో ఎవరి చేతిలో చూసిన ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. చాలామంది కొత్త స్మార్ట్ ఫోన్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా తక్కువ ధరకే అంటే రూ.10వేల లోపు అద్భుతమైన ఫీచర్లతో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, పోకో M7 5G స్మార్ట్ ఫోన్ ఉత్తమ ఎంపిక అవుతుంది. ఈ పోకో పరికరం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇదే సమయంలో ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్ల నుండి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు పోకో M7 5G స్మార్ట్ ఫోన్ డీల్స్, ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
పోకో M7 5G డిస్కౌంట్:
పోకో M7 5G స్మార్ట్ ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.₹9,999కి లాంచ్ అయింది.అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ పరికరం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.8,999కి లిస్ట్ అయింది. అదనంగా, బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే, PNB క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి చెల్లింపులపై 10% తగ్గింపు (రూ. 1,000 వరకు) పొందవచ్చు. దీని వలన ఈ పరికరం రూ. 8,099కి లభిస్తుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ కొనుగోలు పై ఏకంగా రూ. 6,900 ఎక్స్ఛేంజ్ విలువ పొందవచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ వాల్యూ ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
also read:Diabetes: గుండె నుంచి కిడ్నీల వరకు డయాబెటిస్ ఎఫక్ట్..ఈ అవయాలపై ఎక్కువ!
పోకో M7 5G ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..పోకో M7 5G స్మార్ట్ ఫోన్ 1600×720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షియోమి హైపర్‌ఓఎస్ పై నడుస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే..ఈ పరికరంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో f/1.8 ఎపర్చర్‌తో సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్ ను కలిగి ఉంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. భద్రత కోసం, ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొలతలు పరంగా ఈ ఫోన్ 171.88 mm పొడవు, 77.8 mm వెడల్పు, 8.22 mm మందం, 205.39 గ్రాముల బరువు.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

