Poco M8 5G Sale: పోకో ఇటీవల పోకో M8 5G పేరిట శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరికరం విక్రయాలు భారత టెక్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్ గత సంవత్సరం పోకో M7 5G కంటే అనేక ప్రధాన అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 6.77-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లే, 5,520mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పోకో M8 5G ధర:
పోకో M8 5G విక్రయాలు ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. ఇండియాలో పోకో M8 5G ధర బేస్ 6GB/128GB వేరియంట్‌కు రూ.18,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB/128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999గా, 8GB/256GB వేరియంట్‌ల ధర రూ. 21,999గా ఉంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌లో భాగంగా..కంపెనీ పోకో M8 5G బేస్ వేరియంట్‌ను రూ. 15,999 కు, 8GB/128GB వేరియంట్‌ను రూ. 16,999 కు, టాప్-ఎండ్ వేరియంట్‌ను రూ. 18,999 కు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. అదనంగా ఈ ధరలో బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో ICICI, HDFC, SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడంపై రూ. 2,000 తగ్గింపు, రూ. 1,000 లాంచ్ ప్రయోజనం ఉన్నాయి. కాగా, ఈ పరికరాన్ని మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు. అవి కార్బన్ బ్లాక్, గ్లేషియల్ బ్లూ, ఫ్రాస్ట్ సిల్వర్.
also read:Royal Enfield: 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్.. ధర, ఫీచర్ల పూర్తివివరాలివే!
పోకో M8 5G ఫీచర్లు:
ఈ పోకో పరికరం 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.77-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3,200 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని, వెట్ టచ్ 2.0ని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజీ కూడా అందిస్తుంది. ఈ పరికరం హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0తో ఆండ్రాయిడ్ 15లో నడుస్తుంది. ఫోటోగ్రఫీ కోసం..పరికరం 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఇక ముందు భాగంలో ఫోన్ 4K వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0తో ఆండ్రాయిడ్ 15లో నడుస్తుంది. బ్యాటరీ పరంగా ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,520mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65, IP66 రేటింగ్‌లను కలిగి ఉంది.

