Thursday, March 12, 2026
Homeటెక్నాలజీiPhone Fold 2026: టెక్ ప్రియులకు పండగే.. ఆపిల్ నుండి రాబోతున్న 20 కొత్త గ్యాడ్జెట్లు

iPhone Fold 2026: టెక్ ప్రియులకు పండగే.. ఆపిల్ నుండి రాబోతున్న 20 కొత్త గ్యాడ్జెట్లు

apple Future Tech: 2026 సంవత్సరం టెక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారబోతోంది. ముఖ్యంగా ఆపిల్ ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 20 వరకు కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ముందుకు వస్తోంది. సాధారణ వార్షిక అప్‌డేట్స్‌కే పరిమితం కాకుండా, కొత్త ఫామ్ ఫ్యాక్టర్స్, కొత్త ప్రైసింగ్ ఐడియాలు, ఏఐ ఇంటిగ్రేషన్, స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్ అన్నింటినీ కలిపి యూజర్ లైఫ్‌ను పూర్తిగా కవర్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫోన్ నుంచి వాచ్ వరకు, మాక్ నుంచి హోమ్ హబ్ వరకు ప్రతి క్యాటగిరీలోనూ ఆపిల్ తన పట్టు మరింత బలపరచాలని చూస్తోంది.

- Advertisement -

ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తొలి లాంచ్ వేవ్

సంవత్సరం మొదటి భాగంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కోర్ డివైసుల రిఫ్రెష్‌లు కనిపించనున్నాయి. అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో కొత్త ఐఫోన్ 17e ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ బలంగా ఉంది. ఇది ఐఫోన్ 16eకి అప్‌గ్రేడ్‌గా బెటర్ చిప్, డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్లతో రావొచ్చని అంచనా. ఐప్యాడ్ బేస్ మోడల్ కొత్త ఏ సిరీస్ చిప్‌కి మారుతుందట, ఐప్యాడ్ ఎయిర్ మాత్రం నేరుగా ఎం4 ప్రాసెసర్‌కి జంప్ అవుతుందని సమాచారం. మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రో కొత్త ఎం5 సిరీస్ చిప్స్‌తో అప్‌డేట్ అవుతాయట. మాక్ స్టూడియోలో ఎం5 మ్యాక్స్, ఎం5 అల్ట్రా లాంటి పవర్‌ఫుల్ ఆప్షన్లు రావొచ్చని లీకులు చెబుతున్నాయి. మాక్ మినీకి కూడా రిఫ్రెష్ రెడీగా ఉందనే మాట వినిపిస్తోంది.

స్టూడెంట్స్ కోసం కొత్త మాక్‌బుక్ ప్రయోగం

ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రయోగం కూడా ప్లాన్‌లో ఉందట. తక్కువ ధరలో స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త మాక్‌బుక్ తీసుకురావాలని ఆపిల్ ఆలోచిస్తోందని ఇండస్ట్రీ టాక్. ఇందులో ఎం సిరీస్ కాకుండా ఏ18 ప్రో చిప్ ఉండొచ్చని, 12.9 ఇంచ్ డిస్‌ప్లే, బ్రైట్ కలర్స్‌తో యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఇది నిజమైతే మాక్ లైనప్‌లోనే ఓ కొత్త దారి తెరుచుకుంటుంది.

స్మార్ట్ హోమ్ మీద గట్టిపట్టు

ఇదే సమయంలో స్మార్ట్ హోమ్ సెగ్మెంట్‌లో కూడా ఆపిల్ గట్టిగా అడుగు పెడుతోంది. కొత్త స్మార్ట్ హోమ్ హబ్, పర్సనలైజ్డ్ సిరి రెడీ అయిన తర్వాత లాంచ్ అవుతుందని సమాచారం. దానికి తోడు హోమ్‌కిట్ సపోర్ట్ ఉన్న సెక్యూరిటీ కెమెరా కూడా రావొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంటే లైట్స్, కెమెరాలు, హోమ్ ఆటోమేషన్ అన్నీ ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం ఇది.

Read Also: February 2026 smartphones: ఫిబ్రవరి 2026 ధమాకా.. భారత్‌లో లాంచ్ అవుతున్న టాప్ 7 పవర్‌ఫుల్ 5జి ఫోన్లు

సెప్టెంబర్‌లో అసలు షో స్టార్ట్

సంవత్సరం రెండో భాగం అంటే సెప్టెంబర్ చుట్టూ అసలు హైలైట్ మొదలవుతుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొత్త చిప్స్, కెమెరా అప్‌డేట్స్, శాటిలైట్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. అదే టైమ్‌లో ఫోల్డబుల్ ఐఫోన్ కూడా స్టేజ్ మీదకి రావొచ్చని బలమైన రూమర్స్. దాదాపు క్రీజ్ కనిపించని ఇన్నర్ డిస్‌ప్లే, పవర్ బటన్‌లోనే టచ్ ఐడి లాంటి డిజైన్ మార్పులతో ఇది పూర్తిగా కొత్త ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని టెక్ అనలిస్టులు చెబుతున్నారు.

వాచ్, ఎయిర్‌పాడ్స్ అప్‌డేట్స్

వేరబుల్స్ విషయంలో ఆపిల్ వాచ్ సిరీస్ 12, ఆపిల్ వాచ్ అల్ట్రా 4 అప్‌డేట్స్ రావొచ్చని సమాచారం. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా హయ్యర్ ఎండ్ ఏఐ ఫీచర్లతో ఎంట్రీ ఇవ్వబోతోందనే టాక్ ఉంది. హెల్త్ ట్రాకింగ్, ఆడియో క్వాలిటీ, డైలీ యూజ్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ మరో లెవల్‌కి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.

చివరికి ఏమవుతుంది?

ఇంకా స్పష్టమైన టైమ్‌లైన్ లేకపోయినా కొత్త ఆపిల్ టీవీ, హోమ్‌పాడ్ మినీ, ఎయిర్‌ట్యాగ్, ఐప్యాడ్ మినీ అప్‌డేట్స్ కూడా 2026లోనే వచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. దీని తర్వాతి దశలో స్మార్ట్ గ్లాసెస్, ఫేస్ ఐడి డోర్‌బెల్ లాంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఆపిల్ పైప్‌లైన్‌లో ఉన్నాయట. మొత్తానికి ఈ లిస్టులో సగం అయినా నిజమైతే 2026 ఆపిల్‌కు గేమ్‌చేంజర్ ఇయర్ అవుతుంది. ఫోన్ నుంచి స్మార్ట్ హోమ్ వరకు, వాచ్ నుంచి ఏఐ వరకు ప్రతి రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, యూజర్ డైలీ లైఫ్‌లో ప్రతి మూలకు చేరాలనే స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News