Primebook AI Laptops Launched: ఇండియాలోని మొట్టమొదటి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్ బ్రాండ్ అయిన ప్రైమ్‌బుక్..మార్కెట్లోకి రెండు కొత్త శక్తివంతమైన ల్యాప్‌టాప్ మోడల్‌లను విడుదల చేసింది. అవి ప్రైమ్‌బుక్ 2 ప్రో, ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్. ప్రీమియం డిజైన్, అధునాతన హార్డ్‌వేర్‌ను కలిగి ఉన్న ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు ప్రత్యేకమైన AI ఫీచర్లకు మద్దతు ఇస్తాయి. తయారీదారులు ఈ ల్యాప్‌టాప్‌లను ప్రత్యేకంగా విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కోడర్లు, కంటెంట్ క్రియేటర్, యూత్ కు కోసం రూపొందించారు. బడ్జెట్ ధరలో అధిక పనితీరు కోసం చూస్తున్నట్లయితే, ఇవి ఉత్తమ ఎంపికలు అవుతాయి.
ప్రైమ్‌బుక్ 2 ప్రో, ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్: ధర
భారత మార్కెట్లో ప్రైమ్‌బుక్ 2 ప్రో ధర రూ.17,990కు అందుబాటులో ఉంది. కాగా, ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్ ధర రూ.19,990కు కొనుగోలుకు చేయొచ్చు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రైమ్‌బుక్ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌గా, ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై కస్టమర్లు అదనంగా రూ.500 తగ్గింపును పొందవచ్చు.
Also Read:Redmi 15R 5G Launched: 6,000mAh బ్యాటరీతో రెడ్‌మి 15R 5G విడుదల..ధరెంతో తెలుసా..?
ప్రైమ్‌బుక్ 2 ప్రో, ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్: ఫీచర్లు
ప్రైమ్‌బుక్ 2 ప్రో యాంటీ-గ్లేర్ పనితీరుతో 14.1-అంగుళాల పూర్తి-HD రిజల్యూషన్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 128GB UFS స్టోరేజ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్, ఒకే ఛార్జ్‌పై 14 గంటల వరకు ఉంటుందని సమాచారం. మరోవైపు..ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్ యాంటీ-గ్లేర్ పనితీరుతో 15.6-అంగుళాల పూర్తి-HD IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 256GB స్టోరేజ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్, ఒకే ఛార్జ్‌పై 12 గంటల వరకు ఉంటుంది.
రెండు ల్యాప్‌టాప్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ప్రైమ్‌ఓఎస్ 3.0 పై నడుస్తాయి. రెండు మోడళ్లు స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తాయి. మీడియాటెక్ ప్రాసెసర్ 8GB RAMతో జత చేయబడింది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు 1440p వెబ్‌క్యామ్, నాయిస్-క్యాన్సిలింగ్ మైక్రోఫోన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫాస్ట్ ఛార్జింగ్‌తో డ్యూయల్ USB-A, USB-C పోర్ట్‌లను కలిగి ఉంటాయి. మైక్రో SD ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. ముఖ్యంగా తక్కువ ధర ఉన్నప్పటికీ, ఈ ల్యాప్‌టాప్‌లు బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంటాయి. రెండు ల్యాప్‌టాప్‌లు AI కంపానియన్, AI-ఆధారిత గ్లోబల్ సెర్చ్ వంటి అంతర్నిర్మిత AI లక్షణాలతో కూడా వస్తాయి.


