Projector Offers in Popular E-commerce Amazon site: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దిమ్మదిరిగే ఆఫర్‌తో ముందుకొచ్చింది. కొత్త ప్రొజెక్టర్లపై కనీవినీ ఎరుగని భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దివాళీ సేల్ ముగిసినప్పటికీ.. ఈ భారీ ఆఫర్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో లభిస్తున్న టాప్ 5 ప్రొజెక్టర్లు, వాటిపై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ గేట్ ఆటమ్ 3X
ఈ గేట్ ఆటమ్ 3X ప్రొజెక్టర్ అసలు ధర రూ.21,990 ఉండగా.. అమెజాన్‌లో దీన్ని ఏకంగతా 73 శాతం భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రోజెక్టర్ కేవలం రూ.5,990 ధరకే లభిస్తుంది. ఈ గేట్ ఆటమ్ 3X ఫుల్ హెచ్‌డీ 1080p వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 13.0 అంగుళాల ఆటోమేటిక్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ 300 ISOతో పాటు 4K HDR సపోర్ట్‌తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌కు సపోర్ట్ చేస్తుంది. నెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. ARC-HDMI, యూఎస్‌బీ, వైఫై 6, బ్లూటూత్‌తో సహా స్క్రీన్ మిర్రరింగ్ వంటివి ఉన్నాయి.
విజాట్కో యువ గో
విజాట్కో యువ గో అసలు ధరను రూ.21,990 వద్ద కంపెనీ నిర్ణయించింది. ఇప్పుడు దీన్ని 77 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తద్వారా దీన్ని కేవలం రూ.4,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. విజట్కో యువ గో 1080p, 4K రిజల్యూషన్ సపోర్ట్‌తో కూడిన ఆండ్రాయిడ్ 13.0 స్మార్ట్ ప్రొజెక్టర్‌తో వస్తుంది. రొటేట్ డిజైన్‌ను కలిగి ఉన్న ఈ ప్రొజెక్టర్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైఫై, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్, ఆర్క్ వంటి అదిరిపోయే ఫీచర్లు సైతం ఉన్నాయి.
జీబ్రానిక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట ఎల్‌ఈడీ ప్రొజెక్టర్
జీబ్రానిక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ అసలు ధర రూ.14,999 వద్ద ఉండగా.. దీనిపై 67 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా, దీన్ని కేవలం రూ.4,989 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులపై 10% అనగా రూ.1250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో, కేవలం రూ.4,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. జీబ్రోనిక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ 4K UHD సపోర్ట్, 100 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంటుంది. ఇది 240° వరకు కర్వ్డ్ ఫీచర్లతో వస్తుంది. ఇది మిరాకాస్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.4, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులను కలిగి ఉంటుంది. అలాగే ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకు సపో్ట చేస్తుంది.
పోట్రానిక్స్ బీమ్ 440 స్మార్ట ఎల్‌ఈడీ ప్రొజెక్టర్
పోట్రానిక్స్ బీమ్ 440 స్మార్ట ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ అసలు ధర రూ.19,999 వద్ద ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 76% డిస్కౌంట్ లభిస్తుంది. అనగా దీన్ని కేవలం రూ.4,740 వద్ద కొనుగోలు చేయవచ్చు. పోర్ట్రోనిక్స్ బీమ్ 440 స్మార్ట్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ 720p హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ఇన్‌బిల్ట్ యాప్‌లతో వస్తుంది. ఇది 2000 ల్యూమెన్‌లు, స్క్రీన్ మిర్రరింగ్‌ను అందిస్తుంది.


