Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRealme 15 Pro 5G: రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్...

Realme 15 Pro 5G: రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్..డిజైన్​ అదుర్స్ భయ్యా!

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition Launched: చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ ఇండియాకు స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీని రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరిట తీసుకొచ్చింది. కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్ ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయినా రియల్‌మీ 15 Pro 5G మోడల్‌ను ఆధారం చేసుకుని రూపొందించింది. అయితే ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైన్ అంశాలు, స్టైలిష్ నానో-ఎన్‌గ్రేవ్డ్ మోటిఫ్‌లు, కస్టమ్ UI థీమ్‌లను పొందుపరిచారు. ఇది లిమిటెడ్ ఎడిషన్‌. అంటే కంపెనీ దీన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.

- Advertisement -

 

ప్యాకేజింగ్

కంపెనీ కస్టమర్లను ఆకట్టుకునేలా దీని ప్యాకేజింగ్ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ప్యాక్ లో ఈ ఫోన్‌ను ఐరన్ థ్రోన్ ఫోన్ స్టాండ్, కింగ్స్ హ్యాండ్ పిన్, వెస్టెరోస్, అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్-బ్రాండెడ్ స్టిక్కర్లు, పోస్ట్‌కార్డ్‌లు, ఇంకా ఇతర యాక్సెసరీస్ అందించారు.

డిజైన్

గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్, గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. వెనుక భాగంలో కెమెరా చుట్టూ 3D డ్రాగన్ క్లా బోర్డర్, మోటిఫ్‌లు కనిపిస్తాయి. ఫోన్ దిగువ భాగంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నుండి హౌస్ టార్గారియన్ చిహ్నామైన మూడు తలల డ్రాగన్ ముద్రించి ఉంటుంది. ఈ ఫోన్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ చేంజింగ్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. కామన్ గా నలుపు రంగులో ఉండే ఈ ప్యానెల్ 42°C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో తాకినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది డిజైన్‌కు ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది.

ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో రెండు ప్రత్యేకమైన కస్టమ్ UI థీమ్‌లు ఉన్నాయి. మొదటిది “Ice” UI థీమ్. ఇది చల్లటి బ్లూ షేడ్స్‌తో ఉంటుంది. రెండవది “డ్రాగన్‌ఫైర్” UI థీమ్‌. ఇది అగ్ని లాంటి ఎరుపు రంగులతో రూపొందించబడింది. వీటితో పాటు ప్రత్యేకమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాల్‌పేపర్లు, ఐకాన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

 

ధర

ఇండియాలో ఈ ప్రత్యేక ఎడిషన్ ను కంపెనీ 12GBRAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999గా పేర్కొంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లిస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ పరికరాన్ని వినియోగదారులు రూ.41,999 ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలు అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు

రియల్‌మీ 15 ప్రో 5జీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ప్రామాణిక మోడల్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల 1.5K (2800×1280 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2500Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌, 6500 nits వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షణ పొందుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 ప్రాసెసర్ ను అమర్చారు. 12GB వరకు LPDDR4x RAM, 512GB వరకు UFS 3.1 అంతర్నిర్మిత నిల్వ జత చేశారు. ఇది డ్యూయల్-సిమ్ (నానో + నానో) సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6.0ని నడుపుతుంది.

ఫోటోగ్రఫీ కోసం, ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ రియర్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం, దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఫోన్ IP66+IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫోన్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad