Realme 15x 5g Launch Date: ప్రముఖ బ్రాండ్ రియల్‌మి త్వరలో తన కస్టమర్ల కోసం మరో కొత్త 5G ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీ అయింది. కంపెనీ దీని రియల్‌మి 15x 5G పేరిట తీసుకురానుంది. ఇది రియల్‌మి 15 సిరీస్ కింద లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ పరికరం గత సంవత్సరం మార్కెట్లో లాంచ్ అయినా రియల్‌మి 14xకి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ క్రమంలో కంపెనీ రియల్‌మి 15x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్‌కు ముందు, ఈ పరికరం కొన్ని ఫీచర్లను ధృవీకరించింది.
ఫీచర్ల లీకులు
కంపెనీ ధ్రువీకరించిన లీకులు ప్రకారం..రియల్‌మి 15x 5G పరికరం 1200 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం, 144Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ (MIL-STD 810H సర్టిఫికేషన్)ను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ ఆక్టా-కోర్ 6nm ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మునుపటి మోడల్ మాదిరిగానే మీడియాటెక్ 6300 ప్రాసెసర్ తో రావచ్చు. ఈ పరికరం 8GB వరకు RAM, 10GB వర్చువల్ RAM, 256GB వరకు నిల్వను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కేమెరా విషయానికి వస్తే, ఫోన్‌లో సోనీ సెన్సార్‌తో కూడిన 50MP వెనుక కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP69 రేటింగ్ ను కలిగి ఉంటుంది. ఈ పరికరం 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
also read:JIO: జియో రూ.899 రీఛార్జ్ ప్లాన్.. లెక్కలేనన్ని బెనిఫిట్స్..
లాంచ్ డేట్, ధర లీకులు
రియల్‌మి 15x 5G స్మార్ట్ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా, 8GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా, అలాగే 8GB+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999గా ఉండవచ్చు. అయితే, ఈ పరికరాల కొనుగోలు సమయంలో 10% తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఈ పరికరం అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఇది రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.


