Friday, December 12, 2025
Homeటెక్నాలజీRealme C85 5G Launched: 7,000mAh బ్యాటరీతో రియల్‌మీ C85 5G విడుదల..ధర కూడా తక్కువే!

Realme C85 5G Launched: 7,000mAh బ్యాటరీతో రియల్‌మీ C85 5G విడుదల..ధర కూడా తక్కువే!

Realme C85 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ తన కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీని రియల్‌మీ C85 5G పేరిట ఇండియాలో తీసుకొచ్చింది. ఇందులో 6.8-అంగుళాల LCD స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 7,000mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్ల ఉన్నాయి. చాలారోజుల నుంచి బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

రియల్‌మీ C85 5G ధర, లభ్యత

కంపెనీ ఇండియన్ మార్కెట్లో రియల్‌మీ C85 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM+ 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ ధర రూ.14,999గా పేర్కొంది. అలాగే, 6GB RAM+ 128GB స్టోరేజ్ కలిగిన టాప్-ఆఫ్-ది-లైన్ ఆప్షన్ ధర రూ.16,499గా నిర్ణయించింది. ఈ పరికరం ప్యారట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ రంగులలో లభిస్తోంది. డిసెంబర్ 1 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభంకానున్నాయి. దీని రియల్‌మీ వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

also read:Juice For Glowing Skin: ఈ జ్యూస్‌లు తాగితే చాలు..మెరిసే చర్మం మీ సొంతం!

 

రియల్‌మీ C85 5G ఫీచర్లు

డిస్ప్లే:

ఈ రియల్‌మీ పరికరం HD+ (720×1,570 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల LCD స్క్రీన్ కలిగి ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 nits వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

 

ప్రాసెసర్, స్టోరేజీ:

ఇది ARM Mali-G57 MC2 GPU తో జత చేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. రియల్‌మీ C85 5Gలో 6GB వరకు RAM, 12GB వరకు డైనమిక్ RAM కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉంది.

 

సాఫ్ట్ వేర్:

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది.

also read:Best Camera Phones Under Rs 15K: ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా..? కేవలం రూ.15 వేల లోపు లభించే బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే!

కెమెరా:

ఫోటోగ్రఫీ కోసం..ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 వెనుక కెమెరా యూనిట్ ఉంది. ఇది 30 fps వద్ద 1080p రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. కొత్త హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. వినియోగదారులు 30 fps వద్ద 1080p వీడియోలను షూట్ చేయవచ్చు.

 

బ్యాటరీ:

బ్యాటరీ విషయానికి వస్తే..ఈ ఫోన్ 45W SuperVOOC వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. ఫోన్ ఒకే ఛార్జ్‌పై 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 50 గంటల కాలింగ్, 145 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

కనెక్టివిటీ ఫీచర్లు:

కనెక్టివిటీ ఎంపికలలో.. ఈ పరికరం 5G, 4G LTE, USB టైప్-C పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, Beidou, GPS, GLONASS, గెలీలియో, QZSS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్ల జాబితాలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలెరోమీటర్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. ఇక డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ ను కలిగి ఉంది.

కొలతలు:

ఈ ఫోన్ కొలతలు 166.07×77.93×8.38mm. బరువు సుమారు 215 గ్రా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News