Realme C85 Series: ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసాయి. కంపెనీ తన కొత్త C85 సిరీస్‌ను వియత్నాంలో రిలీజ్ చేసింది. ఇందులో రియల్‌మీ C85 ప్రో, రియల్‌మీ C85 5G మోడల్‌లు ఉన్నాయి. రెండు పరికరాలు సరసమైన ధరలో బిగ్ బ్యాటరీ లైఫ్, ప్రకాశవంతమైన డిస్ప్లేలు, AI-మెరుగైన ఫీచర్లతో వస్తుండటం విశేషం. ఇప్పుడు ఈ రెండు ఫోన్ల ధరలు, ఫీచర్ల గురించి వివరంగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
రియల్‌మీ C85 ప్రో, రియల్‌మీ C85 5G ధర:
కంపెనీ రియల్‌మీ C85 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు వియత్నాంలో ప్యారేట్, పీకాక్ గ్రీన్ వంటి రంగు ఎంపికలలో తీసుకొచ్చింది. రియల్‌మీ C85 ప్రో ధర 8GB+128GB స్టోరేజీ వేరియంట్ ధర 6,490,000 VND (సుమారు రూ. 21,800)గా, 8GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర 7,090,000 VND (సుమారు రూ. 24,000)గా నిర్ణయించింది. ఇక బేస్ రియల్‌మీ C85 5G ధర 8GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర 7,690,000 VND (సుమారు రూ. 26,000)గా పేర్కొంది.
రియల్‌మీ C85 ప్రో, రియల్‌మీ C85 5G ఫీచర్లు:
డిస్ప్లే
రియల్‌మీ C85 ప్రో స్మార్ట్ ఫోన్ పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4000 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక రియల్‌మీ C85 5G, HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ప్రాసెసర్, స్టోరేజీ
రియల్‌మీ C85 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ ఉంది. ఇది 4G LTE పరికరంగా మారుతుంది. అయితే రియల్‌మీ C85 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది. రెండు ఫోన్‌లు 8GB వరకు RAM (వర్చువల్ మెమరీ ద్వారా 24GB వరకు విస్తరించవచ్చు), 256GB వరకు అంతర్గత నిల్వను కలిగి ఉంటాయి. మైక్రో SD కార్డ్ ద్వారా నిల్వను మరింత విస్తరించవచ్చు.
సాఫ్ట్ వేర్
రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6.0పై నడుస్తాయి.
కెమెరా, బ్యాటరీ
ఫోటోగ్రఫీ కోసం.. రెండు ఫోన్‌లలో 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే రెండు ఫోన్‌లలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ ఉంది.
కనెక్టివిటీ ఫీచర్లు, కొలతలు
రియల్‌మీ C85 ప్రో మోడల్ కొలతలు 164.4×77.99×8.09. బరువు 205 గ్రాములు. అయితే, రియల్‌మీ C85 5G మోడల్ బరువు 215 గ్రాములు. 8.38 మిమీ మందం కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ల Wi-Fi 5, బ్లూటూత్ 5.0 (C85 ప్రో) / 5.3 (C85 5G), GPS, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.


