Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRealme GT 8 Series Launched: 7000mAh బ్యాటరీతో రియల్‌మీ జీటీ 8 సిరీస్ స్మార్ట్...

Realme GT 8 Series Launched: 7000mAh బ్యాటరీతో రియల్‌మీ జీటీ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Realme GT 8 Series: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ తన కస్టమర్ల కోసం మార్కెట్లోకి సరికొత్త ఫోన్లను తీసుకొచ్చింది. కంపెనీ జీటీ సిరీస్‌లో రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లు చైనాలో లాంచ్ చేసింది. ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ ఇవి ఇండియాలో త్వరలో లాంచ్ అవుతాయని సమాచారం. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, R1X గ్రాఫిక్స్ చిప్‌, 7000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్ల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ధర:

కంపెనీ రియల్‌మీ జీటీ 8 స్మార్ట్ 12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ వేరియంట్ ధర 2899 యువాన్లు (సుమారు రూ. 35,850)గా పేర్కొంది. అలాగే, 16GBRAM+1TB స్టోరేజ్‌లో వచ్చే దీని టాప్ వేరియంట్ ధర 4099 యువాన్లు (సుమారు రూ. 50,690)గా నిర్ణయించింది. ఇక ప్రో వేరియంట్ విషయానికొస్తే..ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌లో వస్తుంది. దీని ధర 3,999 యువాన్లు (సుమారు రూ. 49,440). అయితే 16GB RAM + 1TB స్టోరేజ్ కలిగిన రియల్‌మీ జీటీ 8 ప్రో టాప్ వేరియంట్ ధర 5,199 యువాన్లు (సుమారు రూ. 64,280)గా ఉంది.

ఫీచర్లు:

రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP69+IP68+IP66 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మీ GT 8 ప్రో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇది 7000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో 6.79-అంగుళాల QHD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. రియల్‌మీ జీటీ 8 ప్రో 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఎంపికలో అందించారు. కాకపోతే ఈ రెండు ఫోన్‌ల మధ్య నిల్వ రకాలు భిన్నంగా ఉంటాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే..ప్రో మోడల్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 200MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించింది. మరోవైపు..8మోడల్ లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కంపెనీ దీనికి ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ప్రో మోడల్ 120W, 8మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad