Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRealme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్...

Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..త్వరలోనే ఇండియాలోకి

Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కస్టమర్ల కోసం మరో కొత్త 5G ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ దీని చైనాలో రియల్‌మీ GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్‌ పేరిట తీసుకొచ్చింది. ఈ పరికరం స్టాండర్డ్ రియల్‌మీ GT 8 ప్రో పోలి కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ డిజైన్ పరంగా గణనీయంగా భిన్నంగా ఉంటుంది. పరిమిత ఎడిషన్ ఆస్టన్ మార్టిన్ గ్రీన్ ఫినిష్, వెనుక భాగంలో ఐకానిక్ సిల్వర్-వింగ్ లోగోను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన కస్టమ్-డిజైన్ బాక్స్‌లో కూడా వస్తుంది. ఇందులో ఆస్టన్ మార్టిన్-థీమ్ ఫోన్ కేసు, రేస్ కార్-ఆకారపు సిమ్ ఎజెక్టర్ సాధనం వంటి ప్రత్యేకమైన ఉపకరణాలు ఉన్నాయి. ఫోన్‌లో F1 వాల్‌పేపర్‌లు, కెమెరా వాటర్‌మార్క్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

రియల్‌మీ GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ ధర

ధర గురించి మాట్లాడితే..రియల్‌మే GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 ఎడిషన్ చైనాలో 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,499 (సుమారు ₹68,000)గా ఉంది. ఇక స్టాండర్డ్ రియల్‌మీ GT 8 ప్రో 16GB RAM + 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 5,199 (సుమారు ₹64,000) ఉంటుందని భావిస్తున్నారు.

also read:Toyota Hilux 2025: హైబ్రిడ్,ICE ఎంపికలతో సరికొత్త టయోటా హిలక్స్ లాంచ్..

రియల్‌మీ GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

రియల్‌మే GT 8 ప్రో నవంబర్ 20న భారతదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ కూడా స్టాండర్డ్ మోడల్‌తో పాటు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావచ్చని కూడా భావిస్తున్నారు.

 

రియల్‌మే GT 8 ప్రో ఆస్టన్ మార్టిన్ F1 లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు

ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్ 6.79-అంగుళాల QHD+ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 16GBRAM+1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమర్చబడి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

ఫోటోగ్రఫీ కోసం..ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. 50-మెగాపిక్సెల్ రికో GR యాంటీ-గ్లేర్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్. ఇక సెల్ఫీల కోసం..కంపెనీ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ ఫోన్ 7000mAh బిగ్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఇది 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69+IP68+IP66 రేటింగ్‌లతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad