Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRealme Buds T200: రియల్‌మీ బడ్స్ T200 విడుదల.. 50 గంటల బ్యాటరీ బ్యాకప్.. ధర...

Realme Buds T200: రియల్‌మీ బడ్స్ T200 విడుదల.. 50 గంటల బ్యాటరీ బ్యాకప్.. ధర కూడా తక్కువే!

Realme Buds T200 Launched: రియల్‌మీ తన కొత్త రియల్‌మీ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు రియల్‌మీ15, రియల్‌మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్లతో తన కొత్త రియల్‌మీ బడ్స్ T200 ను రిలీజ్ చేసింది. ఈ TWS ఇయర్‌బడ్‌లు ఆగస్టు 1, 2025 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. రియల్‌మీ బడ్స్ T200 నాలుగు రంగు ఎంపికలలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఇయర్‌బడ్‌లకు సంబంధించి ధర, ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Realme Buds T200 ధర:

కంపెనీ రియల్‌మీ బడ్స్ T200ని దాదాపు రూ.1,999కే విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్‌లతో వీటిని కేవలం రూ.1,699 కు కొనుగోలు చేయవచ్చు. కాగా, దీని అమ్మకం ఆగస్టు 1, 2025 నుండి ప్రారంభమవుతుంది.

Also Read: Boat: బోట్ నుంచి సరికొత్త ఇయర్ బడ్స్.. 80 గంటల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు..

Realme Buds T200 ఫీచర్లు:

రియల్‌మీ బడ్స్ T200 20Hz–40,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు క్వాడ్ మైక్ సిస్టమ్, ANC ఫీచర్‌తో వస్తాయి. ఇది అవాంఛిత శబ్దాన్ని 32dB వరకు తగ్గిస్తుందని తెలిపింది.

ఇక గేమింగ్ కోసం.. రియల్‌మీ బడ్స్ T200 45ms తక్కువ-లేటెన్సీ గేమ్ మోడ్‌ను అందిస్తాయి. అవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో పాటు LDAC కోడెక్ సపోర్ట్ కూడా కలిగి ఉన్నాయి. ఇవి డస్ట్, నీటి నిరోధకత కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మీ బడ్స్ T200 హై-రిజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్‌ను అందిస్తాయి. 3D స్పేషియల్ ఆడియోకు కూడా మద్దతు ఇస్తాయి. అవి డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

రియల్‌మీ బడ్స్ T200 కేస్‌తో మొత్తం బ్యాటరీ లైఫ్‌ను 50 గంటల వరకు అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒకవేళ ANC ప్రారంభించబడితే, అవి 35 గంటల వరకు లైఫ్ ఇస్తాయి. ఇయర్‌బడ్ లు 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌లో ఐదు గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad