Realme P3 Lite 5G: ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ తన కస్టమర్ల కోసం సరికొత్త పరికరాన్ని మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని కొత్త రియల్‌మీ P3 లైట్ 5G పేరిట తీసుకొచ్చింది. ఈ కొత్త పరికరం P3, P3 అల్ట్రా ఫోన్‌లను కలిగి ఉన్న P3-సిరీస్‌లో వస్తుంది. ఇది బడ్జెట్ ధరలో 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్, 120Hz డిస్ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రత్యేక ఫీచర్ మిలిటరీ-గ్రేడ్ షాక్-రెసిస్టెంట్ బాడీ. ఇది 7.94mm సన్నగా ఉంటుంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
రియల్‌మీ P3 లైట్ 5G: ధర, లభ్యత
కంపెనీ రియల్‌మీ P3 లైట్ 5G బేస్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499గా పేర్కొంది. అలాగే 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499గా నిర్ణయించింది. ఈ మూడు రంగులలో లభిస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 22, 2025 అర్ధరాత్రి 12 గంటల నుండి రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకం ప్రారంభమవుతుంది. కంపెనీ కొనుగోలుదారుల కోసం రూ. 1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. దీని వలన 4GB RAM వేరియంట్ ధర రూ. 9,499గా, 6GB RAM వేరియంట్ ధర రూ. 10,499కే వస్తుంది.
Also Read:Weight Gain Tips: బక్కగా ఉన్నారా..? బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ తినండి..!
రియల్‌మీ P3 లైట్ 5G: ఫీచర్లు
కొత్త రియల్‌మీ ఫోన్ 1604 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 625 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ప్యానెల్ రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఫలితంగా తడి చేతులతో ఫోన్‌ను ఉపయోగించవచ్చు. పనితీరు కోసం రియల్‌మీ P3 లైట్ 5G స్మార్ట్ ఫోన్ లో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 6GB RAM (+12GB వర్చువల్ RAM), 128GB నిల్వతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నడుస్తుంది. అంతేకాదు, ఈ పరికరం అనేక AI లక్షణాలతో వస్తుంది. దీనిలో AI క్లియర్ ఫేస్, AI స్మార్ట్ లూప్, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్, AI స్మార్ట్ సిగ్నల్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో 32MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ పరికరం 18 గంటల కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ లేదా 14 గంటల కంటే ఎక్కువ యూట్యూబ్‌ను ఉపయోగించగలదని రియల్‌మీ చెబుతోంది. అంతేకాకుండా కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 4.8 గంటల కాలింగ్, 11 గంటల కంటే ఎక్కువ మ్యూజిక్ ప్లే సమయాన్ని కూడా పొందవచ్చు. ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఫోన్ బరువు 197 గ్రాములు, మందం 7.94mm.


