Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRealme P3 Lite 5G: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే...

Realme P3 Lite 5G: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రోజంతా వాడొచ్చు..!

Realme P3 Lite 5G Price and Features: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ దేశీయ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన ‘P’ సిరీస్‌లో రియల్‌మీ పీ3 లైట్‌ పేరిట దీన్ని ఆవిష్కరించింది. కేవలం రూ. 10,499 ధరకే అధిరిపోయే ఫీచర్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లను పరిశీలిద్దాం.

- Advertisement -

హెచ్‌డీ డిస్‌ప్లే, లాంగ్‌ లాస్టింగ్‌ బ్యాటరీ..

రియల్‌మీ పీ3 లైట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 2 మీటర్ల నుంచి ఫోన్‌ కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం చాలా త‌క్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. దీనిలోని 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌రేటు, 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనిలోని 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఎక్కువ సమయం ఫోన్‌ను ఆన్‌లో ఉంచుతుంది. అంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే రోజంతా వినియోగించవచ్చు. ఇక, ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0తో పనిచేస్తుంది. మరోవైపు, ఇది రెయిన్‌ వాటర్ టచ్‌ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. తద్వారా తడి చేతులతోనూ ఈ ఫోన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు.

Also Read: https://teluguprabha.net/national-news/husband-says-triple-talaq-in-up-court-premises-in-up-viral-video/

మొత్తం మూడు కలర్‌ ఆప్షన్లలో..

ఇక, కెమెరా విషయానికి వస్తే.. రియల్‌మీ పీ౩ లైట్‌ 5జీ వెనకభాగంలో 32 ఎంపీ రేర్‌ కెమెరాను అమర్చింది. ఇది 8 ఎంపీ సెల్ఫీకెమెరాతో వస్తోంది. బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలోని 6000mAh బ్యాటరీ 5W రివర్స్ ఛార్జింగ్‌, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. తద్వారా ఈ ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్ చేసి, 4.8 గంటలపాటు కాలింగ్‌ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్ చేస్తే 18 గంటల ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం లేదా 14 గంటల పాటు యూట్యూబ్‌ను యాక్సెస్‌ చేయవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ మొత్తం మూడు కలర్‌ వేరియంట్లలో లభిస్తుంది. లిల్లీ వైట్‌, పర్పుల్ బ్లాసమ్‌, మిడ్‌నైట్‌ లిల్లీ కలర్స్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. 4 జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,999 గాను.. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర 13,999 గా ఉంటుంది. లాంచింగ్‌ ఆఫర్‌ కింద 4 జీబీ వేరియంట్‌ను రూ.10,499కి, 6జీబీ వేరియంట్‌ను రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్‌ 22 అర్ధరాత్రి నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad