Sunday, February 8, 2026
Homeటెక్నాలజీRealme P4 Power 5G: 10001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ 5G వచ్చేసిందోచ్..ధర కూడా...

Realme P4 Power 5G: 10001mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్ 5G వచ్చేసిందోచ్..ధర కూడా తక్కువే..!

Realme P4 Power 5G Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత టెక్ మార్కెట్లో సరికొత్త 5G ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీని రియల్‌మీ P4 పవర్ 5G పేరిట తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 10,001mAh సిలికాన్ కార్బన్ ‘టైటాన్ బ్యాటరీ’ ఉండడం విశేషం. ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 39 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.8-అంగుళాల 1.5K 4D కర్వ్+ హైపర్‌గ్లో డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, 50-మెగాపిక్సెల్ కెమెరా, 10,001mAh సిలికాన్ కార్బన్ టైటాన్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

రియల్‌మీ P4 పవర్ 5G -ధర, లభ్యత

కంపెనీ ఈ పరికరాన్ని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది

8GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.25,999
8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.27,999
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.30,999

లాంచ్ భాగంగా కంపెనీ ఈ ఫోన్‌ కొనుగోలు పై రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ విక్రయాలు ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రారంభమవుతుంది. కాగా, ఈ ఫోన్ ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ వంటి మూడు రంగులలో లభిస్తోంది.

also read:Billionaires: పేరుకే బిలియనీర్లు..కానీ, ఏం తింటున్నారో తెలుసా..?

రియల్‌మీ P4 పవర్ 5G- ఫీచర్లు

  • డిస్ప్లే
    ఈ రియల్‌మీ పరికరం 6.8-అంగుళాల 1.5K 4D కర్వ్+ హైపర్‌గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 6,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది.
  • సాఫ్ట్ వేర్
    ఇది డ్యూయల్-సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16-ఆధారిత రియల్‌మే UI 7.0 తో కూడా వస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా నవీకరణలను అందిస్తుంది.
  • ప్రాసెసర్
    ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4nm ప్రాసెస్‌పై తయారు చేయబడింది. ఇది హైపర్‌విజన్+ AI చిప్‌ను కూడా కలిగి ఉంది. ఇది 300% వరకు మెరుగైన రిజల్యూషన్, 400% వరకు సున్నితమైన ఫ్రేమ్ రేట్‌లను అందిస్తుంది.
  • కెమెరా
    ఫోటోగ్రఫీ కోసం..రియల్‌మీ P4 పవర్ 5G డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ (f/1.8) సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ
    ఈ పరికరం ముఖ్య హైలైట్ 10,001mAh సిలికాన్ కార్బన్ టైటాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌లో 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇది 932.6 గంటల స్టాండ్‌బై సమయాన్ని, 185.7 గంటల స్పాటిఫై మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని కూడా అందించగలదు. ఈ ఫోన్ 11.7 గంటల వరకు గేమింగ్ ప్లేబ్యాక్ సమయాన్ని కూడా అందించగలదు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News