Realme P4 Pro 5G Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ పి సిరీస్ లో మార్కెట్లో కొత్త పరికరాన్ని లాంచ్ చేసింది. కంపెనీ దీని రియల్‌మీ P4 ప్రో 5G పేరిట తీసుకొచ్చింది. కంపెనీ ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ 4 ప్రాసెసర్, 7,000mAh బిగ్ బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, లభ్యత, స్పెసిఫికేషన్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Realme P4 Pro 5G ధర, లభ్యత:
కంపెనీ రియల్‌మీ P4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా పేర్కొంది. అదే విధంగా 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు. కాగా, ఈ పరికరం బిర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్‌నైట్ ఐవీ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇక లాంచ్ ఆఫర్ కింద, కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్‌లో రూ.3,000 తగ్గింపు, రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. ఈ ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 27న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ పై రూ.43000 డిస్కౌంట్.. ఇప్పుడే త్వరపడండి!
Realme P4 Pro 5G ఫీచర్లు:
ఈ పరికరం 6.8-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1280×2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 nits పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందిస్తుంది. ఈ ఫోన్‌లో అడ్రినో GPUతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ 4 ప్రాసెసర్ ను అమర్చారు.
ఈ ఫోన్ 8GB/12GB LPDDR4X RAM, 128GB/256GB/512GB UFS 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీUI 6.0పై పనిచేస్తుంది.
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే,ఈ పరికరం 50MP ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం..50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే, 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
కనెక్టివిటీ పరంగా.. ఇందులో డ్యూయల్ 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, టైప్ C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము, నీటి రక్షణ కోసం IP65, IP66 రేటింగ్‌లతో అమర్చబడి ఉంది. కొలతలు ఈ ఫోన్ పొడవు 162.27 mm, వెడల్పు 76.16 mm, మందం 7.68 mm బరువు 189 గ్రాములు.


