Realme p4 pro 5g Special Sale: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్! ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన రియల్‌మీ పి4 ప్రో 12 గంటల ప్రత్యేక సేల్ ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అనగా ఆగస్టు 29న మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఈ ఫోన్ దాని మొదటి అమ్మకం మాదిరిగానే రూ.5,000 తక్కువ ధరకు లభిస్తుంది. ప్రత్యేక అమ్మకంలో అందుబాటులో ఉన్న ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీనిని రూ.19,999 ప్రారంభ ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. అనేక శక్తివంతమైన లక్షణాలతో వస్తున్న ఈ రియల్‌మీ ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర, ఆఫర్లు:
కంపెనీ రియల్‌మీ పి4 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా పేర్కొంది. అలాగే, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.28,999గా నిర్ణయించింది. ఈ పరికరం బిర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్‌నైట్ ఐవీ వంటి రంగులలో లభిస్తోంది.
కొనుగోలుదారులకు ఈ ఫోన్‌పై కంపెనీ రూ.3,000 బ్యాంక్ ఆఫర్, రూ.2,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ఈ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకుంటే, 8GB+128GB వేరియంట్‌ను రూ.19,999గా, 8GB+256GB వేరియంట్‌ను రూ.21,999గా, అలాగే 12GB+256GB వేరియంట్‌ను రూ.23,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ 12 గంటల ప్రత్యేక సేల్ ఆగస్టు 29 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే ఈ పరికరాన్ని ఫ్లిప్‌కార్ట్ లో కాకుండా, దీనిని రియల్‌మే వెబ్‌సైట్, ప్రముఖ స్టోర్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు దీనిని 3 నెలల నో-కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read: Smartphones: 108 ఎంపీ కెమెరాతో వచ్చే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు.. ధర కేవలం రూ.15,000 లోపే..
ఫీచర్లు:
ఈ స్మార్ట్ ఫోన్ 6.8-అంగుళాల పూర్తి-HD ప్లస్ (1080×2800 పిక్సెల్‌లు) అమోలేడ్ 4D కర్వ్ + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 12GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6 పై నడుస్తుంది.
కంపెనీ ఈ ఫోన్‌లో AI-ఆధారిత హైపర్ విజన్ చిప్‌సెట్‌ను అమర్చింది. ఫలితంగా ఇది ఫోన్ గేమ్‌ప్లే, స్పష్టత, ఫ్రేమ్ రేట్, లైటింగ్‌ను మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ AI ల్యాండ్‌స్కేప్, AI స్నాప్ మోడ్, AI పార్టీ మోడ్, AI టెక్స్ట్ స్కానర్‌తో సహా అనేక AI ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఇది ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ OV50D సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీతో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా.. ఇందులో 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్ IP65, IP66 రేటింగ్‌లతో వస్తుంది. భద్రత కోసం, దీనికి ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 7.68 mm మందం. 187 గ్రాముల బరువు ఉంటుంది.


