Friday, January 16, 2026
Homeటెక్నాలజీRealme Pad 3 vs Redmi Pad 2 Pro: ధర, ఫీచర్ల పరంగా ఈ...

Realme Pad 3 vs Redmi Pad 2 Pro: ధర, ఫీచర్ల పరంగా ఈ రెండింట్లో ఏ టాబ్లెట్ కొంటె బెటర్..!

Redmi Pad 2 Pro vs Realme Pad 3 Comparison: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు రియల్‌మీ, రెడ్‌మి భారత టెక్ మార్కెట్లో తమ కస్టమర్ల కోసం సరికొత్త టాబ్లెట్స్ ను విడుదల చేసాయి. రియల్‌మీ తన టాబ్లెట్ ను రియల్‌మీ ప్యాడ్ 3 పేరిట లాంచ్ చేయగా, రెడ్‌మి తన టాబ్లెట్ ను రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G పేరిట తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండు టాబ్లెట్స్ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. జనవరి 6న మార్కెట్లో లాంచ్ అయిన ఈ టాబ్లెట్స్ బిగ్ బ్యాటరీలు, అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లేలు, తాజా ప్రాసెసర్‌లను కలిగి ఉండడం విశేషం. దీంతో ఈ రెండు టాబ్లెట్స్ లో దేని కొనాలని వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర, ఫీచర్ల పరంగా ఈ రెండింట్లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

- Advertisement -

Realme Pad 3 vs Redmi Pad 2 Pro: ధర

8GB RAM+128GB నిల్వతో Wi-Fi వేరియంట్ కోసం రియల్‌మీ ప్యాడ్ 3 రూ.26,999 నుండి ప్రారంభమవుతుంది. ఇక 5G వేరియంట్ రూ.29,999 నుండి ప్రారంభమై రూ.31,999 వరకు ఉంటుంది. ఇదే సమయంలో రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. ఇది మరింత సరసమైనది. రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G వేరియంట్ రూ.25,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, దీని టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ ధర రూ.27,999. ధర పరంగా..రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో స్పష్టంగా బడ్జెట్-ఫ్రెండ్లీగా కనిపిస్తుంది.

Realme Pad 3 vs Redmi Pad 2 Pro:డిస్ప్లే

రియల్‌మీ ప్యాడ్ 3 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతుతో 11.61-అంగుళాల 2.8K డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, ఇది ఆమోలెడ్ డిస్‌ప్లే కాదు. అధిక-నాణ్యత గల LCD ప్యానెల్. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్, 96 శాతం NTSC కలర్ గమట్‌ను అందిస్తుంది. మరోవైపు..రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో పెద్ద 12.1-అంగుళాల 2.5K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

also read:iPhone 17e: ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఐఫోన్ 17e పై బిగ్ అప్డేట్‌..?!

Realme Pad 3 vs Redmi Pad 2 Pro: ప్రాసెసర్

రియల్ మీ ప్యాడ్ 3 మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 4nm ప్రాసెస్‌పై తయారు చేశారు. రోజువారీ ఉపయోగం, మల్టీ టాస్కింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రెడ్‌మి టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2పై నడుస్తుంది. తరచుగా ఆపరేటింగ్ సిస్టమ్, భద్రతా నవీకరణలను హామీ ఇస్తుంది. పనితీరు, దీర్ఘకాలిక మద్దతు పరంగా, రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో కొంచెం అద్భుతంగా ఉంటుంది.

Realme Pad 3 vs Redmi Pad 2 Pro: కెమెరా

రియల్‌మీ ప్యాడ్ 3 8-మెగాపిక్సెల్ వెనుక, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరాలను కలిగి ఉంటుంది ఇవి వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ కు అద్భుతంగా ఉంటుంది. ఇక రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G 8-మెగాపిక్సెల్ వెనుక, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరాలతో కూడా వస్తుంది. రెండూ టాబ్లెట్స్ 1080p వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ రెండు టాబ్లెట్‌లు కెమెరా సామర్థ్యాల పరంగా దాదాపు ఒకేలా ఉంటాయి.

Realme Pad 3 vs Redmi Pad 2 Pro: బ్యాటరీ

రియల్‌మీ ప్యాడ్ 3 12,200mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు..రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 33W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 12,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండూ అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్ అందిస్తాయి. కానీ రియల్‌మీ ప్యాడ్ 3 ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News