Free Jio Hot Star Recharge Plans: టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను తీసుకువస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఇడియా జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉన్న అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే, ఇప్పుడు కేవలం రూ.200 కంటే తక్కువ ధరకు ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
జియో రూ.100 రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మొత్తం 5GB డేటాను పొందుతారు. కాగా, ఈ ప్లాన్‌లో ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (90 రోజులకు) ఆస్వాదించవచ్చు.
జియో రూ.195 రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా ప్లాన్ చెల్లుబాటు 90 రోజులు. ఈ ప్లాన్‌లో మొత్తం 15GB డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (90 రోజులకు) కూడా లభిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.100 రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లోవినియోగదారులు మొత్తం 5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఉచిత జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ (30 రోజులు) కూడా ఉంటుంది.
Also read: Annual Recharge Plans: ఒక రీఛార్జ్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!
ఎయిర్‌టెల్ రూ.195 రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 15GB డేటాను పొందొచ్చు. అలాగే, ఉచిత జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు) అందుబాటులో ఉంటుంది.
వోడాఫోన్-ఇడియా రూ. 101 రీఛార్జ్ ప్లాన్
ఈ డేటా ప్లాన్ చెల్లుబాటు 30 రోజుల. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మొత్తం 5GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఉచిత జియో జాయ్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ (1 నెల) ఉంటుంది.
వోడాఫోన్-ఇడియా యొక్క రూ. 151 ప్లాన్
ఈ డేటా ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు మొత్తం 4GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఉచిత జియో స్టార్ సబ్‌స్క్రిప్షన్ (3 నెలలు) ఉంటుంది.
వోడాఫోన్-ఇడియా యొక్క రూ. 169 ప్లాన్
ఈ డేటా ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం 8GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో 3 నెలల పాటు ఉచిత జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది.


