Saturday, November 15, 2025
HomeTop StoriesRed Magic 11 Pro Series: 8000mAh బ్యాటరీతో రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్‌...

Red Magic 11 Pro Series: 8000mAh బ్యాటరీతో రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్‌ లాంచ్..ఫీచర్స్ అదుర్స్!

Red Magic 11 Pro Series Launched: నుబియా సబ్-బ్రాండ్ రెడ్ మ్యాజిక్ తన కొత్త గేమింగ్ సిరీస్ రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ ప్రో, ప్రో+ అనే రెండు మోడళ్లను తీసుకొచ్చింది. తాజా హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా చైనాలో ఆవిష్కరించారు. రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్లు ఇవే కావడం విశేషం. రెడ్ మ్యాజిక్ 11 ప్రో మోడల్ రెండు రంగులు, రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. మరోవైపు ప్రో+ మోడల్ మూడు రంగులు, నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8,000mAh బిగ్ బ్యాటరీ తో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ల ధర, ఫీచర్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ ధర, లభ్యత:

రెడ్ మ్యాజిక్ 11 ప్రో 12GB RAM+256GB స్టోరేజ్‌ వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ. 62,000) నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ 16GBRAM+ 512GB స్టోరేజ్‌ వేరియంట్ ధర CNY 5,699 (సుమారు రూ. 70,000)గా ఉంది. ఈ ఫోన్ డార్క్ నైట్, సిల్వర్ వార్ గాడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు రెడ్ మ్యాజిక్ 11 ప్రో+ ధర CNY 5,699 (సుమారు రూ. 70,000) నుండి ప్రారంభమవుతుంది. అలాగే 16GBRAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 6,499 (సుమారు రూ. 80,000)గా ఉంది. ఇక 16GB+1TB స్టోరేజీ వేరియంట్ ధర వరుసగా CNY 6,999 (సుమారు రూ. 86,000)గా, 24GB+1TB వేరియంట్ ధర CNY 7,699 (సుమారు రూ. 95,000) గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూటెరియం ఫ్రంట్ ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ వింగ్, డ్యూటెరియం ఫ్రంట్ ట్రాన్స్‌పరెంట్ డార్క్ నైట్, డార్క్ నైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఈ ఫోన్ ను కంపెనీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

also read:Honor Earbuds 4: టచ్ కంట్రోల్‌లతో హానర్ ఇయర్‌బడ్స్ 4 విడుదల.. 46 గంటల బ్యాటరీ లైఫ్..

రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ ఫీచర్లు:

 

డిస్ప్లే
రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 95.3% స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.85-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ 2.0, మ్యాజిక్ టచ్ 3.0, వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది X10 లూమినస్ మెటీరియల్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ప్రాసెసర్, స్టోరేజీ
ఈ సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 24GB వరకు RAM, 1TB వరకు అంతర్గత నిల్వతో జత చేయబడింది.

సాఫ్ట్ వేర్
రెడ్ మ్యాజిక్ 11 ప్రో సిరీస్ రెడ్ మ్యాజిక్ OS 11 పై నడుస్తుంది. ఇందులో క్యూబ్ గేమ్ ఇంజిన్ 3.0, అంతర్నిర్మిత PC గేమ్ ఎమ్యులేటర్ కూడా ఉన్నాయి. ఫోన్ డ్యూయల్ విండ్, వాటర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది గాలి, ఫ్లోరినేటెడ్ లిక్విడ్ కూలింగ్ కలయికను ఉపయోగించి ఫోన్ హీట్‌ను కంట్రోల్ చేస్తుంది.

కెమెరా
ఫోటోగ్రఫీ పరంగా..ఇది 1/1.55-అంగుళాల CMOS సెన్సార్, f/1.88 అపర్చర్, OIS మద్దతుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో ఏఐ ఎరేజర్, వన్-క్లిక్ ఫోటో ఎడిటింగ్, ఏఐ రైటింగ్ అసిస్టెన్స్, ఏఐ ఆబ్జెక్ట్ రికగ్నిషన్, ఏఐ సర్కిల్ టు సెర్చ్, ఏఐ టాక్టికల్ కోచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ
బ్యాటరీ గురించి మాట్లాడితే..ఇది 8,000mAh బుల్ డెమన్ కింగ్ బ్యాటరీ 3.0 తో వస్తుంది, ఇది 120W వైర్డు, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం దీని ఫ్యాన్ IPX8 రేటింగ్‌ ను కలిగి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad