REDMAGIC 11 Pro Launched: రెడ్‌మ్యాజిక్ గురించి ప్రస్తావించకుండా గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడటం అసాధ్యం అని చెప్పవచ్చు. కంపెనీ ఇప్పుడు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ను రెడ్‌మ్యాజిక్ 11 ప్రో రిలీజ్ చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లో తీసుకొచ్చింది. గ్లోబల్ వెర్షన్‌లో ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా, చార్జింగ్ విషయంలో చిన్న తేడా కనపరిచారు. చైనా వెర్షన్‌లో ఉన్న 120W ఫాస్ట్ ఛార్జింగ్ స్థానంలో గ్లోబల్ వెర్షన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో తెచ్చారు. ఈ ఫోన్ దాని అధిక-పనితీరు గల హార్డ్‌వేర్, శక్తివంతమైన బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లే కోసం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర:
ఈ పరికరం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ రెడ్‌మ్యాజిక్ 11 ప్రో 12GB+256GB స్టోరేజీ వేరియంట్ US$749 (రూ. 66,505)గా, అలాగే 16GB+512GB స్టోరేజీ వేరియంట్ 11 ప్రో US$849 (సుమారు రూ. 75,385)గా, 24GB+1TB వేరియంట్ ధర US$999 (సుమారు రూ. 88,705)గా నిర్ణయించింది.
ఫీచర్లు:
డిస్ప్లే
ఈ పరికరం 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.85-అంగుళాల 1.5K OLED BOE X10 డిస్‌ప్లేను కలిగి ఉంది. 960Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఇది 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజీ
ఈ ఫోన్‌కు శక్తినిచ్చేది 3nm ఆధారంగా ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్. ఈ పరికరంలో అడ్రినో 840 GPU కూడా ఉంది. ఈ ఫోన్ 12GB/16GB/24GB LPDDR5T ర్యామ్ తో పాటు 256GB/512GB/1TB (UFS 4.1 Pro) నిల్వ ఎంపికలతో అందుబాటులో ఉంది.
సాఫ్ట్ వేర్
ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ 16 పై పనిచేస్తుంది.
కెమెరా
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే..ఈ పరికరం f/1.88 అపర్చర్‌తో 50MP 1/1.55″ సెన్సార్, f/2.2 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP 120-డిగ్రీ అల్ట్రా-వైడ్ లెన్స్, 16MP ఓమ్నివిజన్ అండర్-డిస్ప్లే ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 11.5K స్పీకర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ
ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7500mAh బ్యాటరీని కలిగి ఉంది.
కొలతలు
ఫోన్ బరువు 230 గ్రాములు. 8.9mm మందం. కంపెనీ దీనిని IPX8 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో పరిచయం చేసింది.


