Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRedmi 15 5G: 7000mAh బిగ్ బ్యాటరీ, 50MP రియర్ కెమెరాలతో రెడ్మీ 15 5G...

Redmi 15 5G: 7000mAh బిగ్ బ్యాటరీ, 50MP రియర్ కెమెరాలతో రెడ్మీ 15 5G వచ్చేసిందోచ్..ధర ఎంతంటే..?

Redmi 15 5G Launched: షావోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి తమ కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కంపెనీ దీని రెడ్‌మి 15 5G పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ.15వేల బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీతో కూడిన గొప్ప 5G ఫోన్ కోసం చేస్తున్నవారికి ఇది ఉత్తమ ఎంపిక. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈపరికరానికి సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

Redmi 15 5G ధర, లభ్యత:

కంపెనీ ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 14,999గా పేర్కొంది. 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా నిర్ణయించింది. కాగా, ఈ పరికరం ఫ్రాస్టెడ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, శాండీ పర్పుల్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తోంది. కస్టమర్లు దీని ఆగస్టు 28 నుండి అమెజాన్, షియోమి ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయొచ్చు.

Also Read:Discount: రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G పై కళ్ళు చెదిరే ఆఫర్..లాంచ్ ధర కంటే రూ.8000 తక్కువ!

Redmi 15 5G ఫీచర్లు:

ఈ స్మార్ట్ ఫోన్ 6.9-అంగుళాల FullHD + (1,080×2,340 పిక్సెల్స్) డిస్‌ప్లేను 144 Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ స్క్రీన్ 288Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి 850 నిట్‌లు. పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s Gen3 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ పరికరం 8GB వరకు RAM, 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే హైర్ఓస్ 2.0 తో వస్తుంది. కంపెనీ ఈ పరికరం రెండు సంవత్సరాల పాటు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను, 4 సంవత్సరాల పాటు భద్రతా నవీకరణలను పొందుతుందని హామీ ఇచ్చింది. రెడ్‌మి ఫోన్‌లో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లను కూడా అందించింది.

కెమెరా గురించి మాట్లాడుకుంటే.. రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌లో AI- పవర్డ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్లు ఉన్నాయి. కెమెరా AI స్కై, AI బ్యూటీ, AI ఎరేస్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఈ రెడ్‌మి 15 5G ఫోన్ ప్రత్యేకత ఏంటంటే? 7000mAh బిగ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

హ్యాండ్‌సెట్ భద్రత కోసం.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్, IR బ్లాస్టర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం పరంగా.. ఇందులో 5G, 4G, బ్లూటూత్, Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ పరికరంలో డాల్బీ-సర్టిఫైడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. పరికరం కొలతలు 168.48×80.45×8.40mm. బరువు 217 గ్రాములు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad