Redmi Buds 8 Pro Launched: షియోమీ చైనాలో రెడ్‌మి టర్బో 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు రెడ్‌మి బడ్స్ 8 ప్రో వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త TWS హెడ్‌సెట్‌లో 11mm డైనమిక్ డ్రైవర్‌తో పాటు 6.7mm సిరామిక్ యూనిట్ కలిగిన డ్యూయల్-డ్రైవర్ సెటప్‌ను అందించారు. హై-రిజల్యూషన్ ఆడియో అనుభూతి కోసం డ్యూయల్ DACలు ఉన్నాయి. ఈ బడ్స్ గరిష్టంగా 55dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతు ఉంది. అలాగే, హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియో ప్లేబ్యాక్, డాల్బీ ఆడియో సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నవంబర్ 2024లో విడుదలైన రెడ్‌మి బడ్స్ 6 ప్రోతో పోలిస్తే, రెడ్‌మి బడ్స్ 8 ప్రో మెరుగైన ఆడియో క్వాలిటీ, అధునాతన నాయిస్ క్యాన్సిలేషన్, ఆధునిక ఫీచర్లతో స్పష్టమైన అప్‌గ్రేడ్‌గా నిలుస్తోంది. ఇప్పుడు ఈ బడ్స్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
రెడ్‌మి బడ్స్ 8 ప్రో- ధర, లభ్యత
రెడ్‌మి బడ్స్ 8 ప్రో వైర్‌లెస్ హెడ్‌సెట్ చైనాలో CNY 399 (సుమారు రూ. 5,300) ధరతో అందుబాటులో ఉంది. ఇది షియోమీ చైనా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. మిస్ట్ బ్లూ, వైట్, బ్లాక్ రంగు ఎంపికల్లో లభిస్తుంది.
రెడ్‌మి బడ్స్ 8 ప్రో- ఫీచర్లు
రెడ్‌మి బడ్స్ 8 ప్రోలో 11mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్, 6.7mm పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ డ్రైవర్‌ను కలిగి ఉన్న డ్యూయల్-డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంది. మెరుగైన సౌండ్ సెపరేషన్, లేయరింగ్ కోసం ఇయర్‌బడ్‌లు మూడు-యూనిట్ అకౌస్టిక్ ఆర్కిటెక్చర్‌తో డ్యూయల్ DAC సిస్టమ్‌ను ఉపయోగిస్తాయి. అవి LHDC, LC3, SBC, AAC, MIHC, MIHC 2.0 కోడెక్‌లతో హై-రెస్ వైర్‌లెస్ ఆడియోకు మద్దతు ఇస్తాయి. కాల్ నాణ్యతను షియోమీ ఇన్-హౌస్ AI కాల్ నాయిస్ రిడక్షన్ సిస్టమ్ నిర్వహిస్తుంది. ఇది 95dB వరకు సౌండ్ ఉన్న వెదర్ లో కూడా స్పష్టమైన కాల్‌లను నిర్వహిస్తుందని పేర్కొంది. ఇయర్‌బడ్‌లు 12m/s వరకు వేగంతో గాలి నాయిస్ రిడక్షన్‌కు కూడా మద్దతు ఇస్తాయి.
also read:iPhone 16e Discount: ఐఫోన్ 16e పై ఖతర్నాక్ డిస్కౌంట్!..ఏకంగా రూ.11,500 తగ్గింపు..
ఈ బడ్స్ అంతర్నిర్మిత సిక్స్-యాక్సిస్ గైరోస్కోప్ ద్వారా డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో స్వతంత్ర ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్, వీడియోస్, గేమ్స్, ఆడియోబుక్‌లలో మెరుగైన సౌండ్ అవుట్‌పుట్ కోసం ఇవి డాల్బీ ఆడియోకు కూడా మద్దతు ఇస్తాయి. ఇక నాయిస్ కంట్రోల్ కోసం..రెడ్‌మి బడ్స్ 8 ప్రో బడ్స్ షియోమీ డీప్ స్పేస్ నాయిస్ క్యాన్సిలేషన్ 3.0 తో వస్తుంది. ఇయర్‌బడ్‌లు 55dB వరకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి.
రెడ్‌మి బడ్స్ 8 ప్రో ఇయర్‌ఫోన్‌లు ఆధునిక బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తాయి. డ్యూయల్-డివైస్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. ఫాస్ట్ పెయిరింగ్, ఇంటెలిజెంట్ ఆడియో స్విచింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి. అలాగే రెండు హెడ్‌ఫోన్‌ల మధ్య ఆడియో షేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. వినియోగదారులు షియోమీ హెడ్‌ఫోన్స్ యాప్ ద్వారా వివిధ సెట్టింగ్‌లను సులభంగా నిర్వహించవచ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌తో రూపొందించారు.
రెడ్‌మి బడ్స్ 8 ప్రో ఇయర్‌బడ్‌లలో ప్రతి ఒక్కదానిలో 54mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. వీటితో పాటు వచ్చే ఛార్జింగ్ కేస్‌లో 480mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా వేగంగా ఛార్జ్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసిన పరిస్థితిలో ఒకే ఛార్జ్‌పై ఈ ఇయర్‌బడ్‌లు సుమారు ఎనిమిదిన్నర గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయని రెడ్‌మి సంస్థ వెల్లడించింది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బ్యాటరీ బ్యాకప్ 35 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు బ్యాటరీ పనితీరు కొంత తగ్గుతుంది. ఈ సందర్భంలో ఒకే ఛార్జ్‌పై సుమారు నాలుగున్నర గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుందని. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 16 గంటల వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. అదనంగా, కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తోనే రెండు గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

