Redmi K80 Ultra Launched: గేమర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త రెడ్‌మీ మొబైల్ చైనాలో రిలీజ్ అయింది. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ రెడ్‌మీ తన కె-సిరీస్‌లోని తాజా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే రెడ్‌మీ K80 అల్ట్రా స్మార్ట్ ఫోన్. కంపెనీ ఈ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్స్ ను అందించింది. ఈ ఫోన్ గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అయితే, ఇప్పుడు రెడ్‌మీ K80 అల్ట్రా ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి వివరంగా తెలుసుకుందాం.
ధర
రెడ్‌మీ K80 అల్ట్రా 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ. 31,000)గా పేర్కొంది. ఇదే సమయంలో 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ. 35,800)గా, 16జీబీ+ 256జీబీ వేరియంట్ ధర 2799 యువాన్లు (సుమారు రూ. 33,400)గా, 16జీబీ+ 512జీబీ వేరియంట్ 3,299 యువాన్లు (సుమారు రూ. 39,400)గా నిర్ణయించింది. ఇక టాప్-ఎండ్ 16జీబీ+ 1TB స్టోరేజ్ వేరియంట్‌ను 3,799 యువాన్లు (సుమారు రూ. 45,400) ధరకు విడుదల చేసింది. ఈ ఫోన్ చైనాలోని కంపెనీ వెబ్‌సైట్‌లో బ్లూ, వైట్, సాండ్‌స్టోన్ యాష్, గ్రీన్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఫీచర్లు
రెడ్‌మీ K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K (1,280×2,772 పిక్సెల్స్) OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 480 Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంటుంది. కంపెనీ ఇన్-హౌస్ Xiaomi షీల్డ్ గ్లాస్ రక్షణను దీనిలో అందించారు. ఈ మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ పరికరం Android 15 ఆధారిత HyperOS 2 స్కిన్‌తో పని చేస్తుంది.
కేమెరా విషయానికి వస్తే..ఇందులో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 20-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,410mAh బ్యాటరీతో 100W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ పరికరం కొలతలు 163.08×77.93×8.18mm, బరువు 291 గ్రాములు. కనెక్టివిటీ కోసం..రెడ్‌మీ K80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, డ్యూయల్-సిమ్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, A-GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.