Redmi K90 Pro Max Leak Features: రెడ్‌మి కె 90 ప్రో మ్యాక్స్ అక్టోబర్ 23న చైనాలో రెడ్‌మి కె 90 మోడల్‌తో పాటు లాంచ్ కానుంది. టెక్ దిగ్గజం ఇప్పటికే ఫోన్ డిజైన్‌ను టీజ్ చేసింది. డెనిమ్-టెక్చర్డ్ బ్యాక్ ప్యానెల్‌తో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను చూపిస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో గోల్డ్, వైట్ రంగులో కూడా కనిపిస్తుంది. ఈ పరికరం బోస్-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని కూడా ధృవీకరించబడింది. లాంచ్‌కు ముందు కంపెనీ ఇప్పుడు పరికరం కొన్ని ఫీచర్లను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
రెడ్‌మి కె 90 ప్రో మ్యాక్స్ ఫీచర్లు( అంచనా)
రాబోయే రెడ్‌మి కె 90 ప్రో మ్యాక్స్ మెరుగైన పిక్చర్ పనితీరు కోసం షావోమి కొత్త D2 AI ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్‌తో జత చేయనున్నారు. ఈ పరికరం పనితీరు కోసం క్వాల్కమ్ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని వీబోలోని పోస్ట్ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటివరకు అతిపెద్ద వేపర్ కూలింగ్ చాంబర్‌ను కూడా అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఫోన్‌లో 6.9-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది షార్ప్ విజువల్స్ కోసం పూర్తి RGB సబ్-పిక్సెల్ లేఅవుట్‌తో ఉంటుంది. ఫోన్ మొత్తం బ్రైట్‌నెస్ పరిధిలో DC డిమ్మింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విషయానికొస్తే..రెడ్‌మి కె 90 ప్రో మ్యాక్స్ 1/1.31-అంగుళాల ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది షావోమి 17లో కూడా ఉపయోగించారు. ఈ పరికరం 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, రెడ్‌మి మొట్టమొదటి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 5x ఆప్టికల్ జూమ్, 10x లాస్‌లెస్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను అందిస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఈ పరికరం 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,560mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.


