Saturday, November 15, 2025
Homeటెక్నాలజీRenault Layoffs: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలో లేఆఫ్స్‌.. ఏకంగా 3 వేల మంది!

Renault Layoffs: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థలో లేఆఫ్స్‌.. ఏకంగా 3 వేల మంది!

Renault Layoffs 3,000 employees: ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ప్రభావంతో ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగుల కోతలు జరిగిన విషయం తెలిసిందే. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కారణమేదైనా ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ సైతం ఉద్యోగుల లేఆఫ్స్‌కు సిద్ధమైంది. దాదాపు 3వేల మందిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/business/few-tricks-to-avoid-out-of-stock-situations-in-e-commerce/

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌ దాదాపు 3వేల మంది వరకు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. హ్యూమన్‌ రిసోర్స్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ వంటి సపోర్టింగ్‌ సర్వీసెస్‌లో సుమారు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. అయితే లేఆఫ్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్దిష్ట సంఖ్య చెప్పలేమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యకలాపాలను సరళీకృతం చేయడం, వేగవంతం చేయడం, ఖర్చులను నియంత్రించడానికి ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్‌ వెల్లడించింది. 

కాగా, రెనాల్ట్ ప్రధానంగా యూఎస్‌ మార్కెట్‌లో కార్లను విక్రయించకపోవడం ద్వారా ట్రంప్‌ సుంకాల బారి నుంచి బయటపడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ, దాని ప్రభావం పరోక్షంగా కంపెనీపై పడుతోంది. యూరోపియన్ ప్రత్యర్థులపై యూఎస్ వాణిజ్య అడ్డంకుల ఒత్తిడి ఇందుకు కూడా ప్రధాన కారణం. రెనాల్ట్ చైనా కంపెనీల నుంచి ముఖ్యంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. 

Also Read: https://teluguprabha.net/technology-news/samsung-news-phones-samsung-galaxy-a07-galaxy-f07-galaxy-m07-4g-launched-in-india-check-price-and-features/

ఇంకా రెనాల్ట్ 70 శాతం కంటే ఎక్కువ కార్లను యూరప్‌లోనే విక్రయిస్తుండగా.. ఆ వేగం ఇప్పుడు నెమ్మదించింది. దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి విస్తరించడం చాలా అవసరమని భావించిన కంపెనీ 2027 నాటికి యూరోపియన్‌ యేతర మార్కెట్లలో 8 కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సుమారు 3.4 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. భారత్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించగా.. స్థానిక డిజైన్, తయారీ సామర్థ్యాలను పెంచేందుకు ఒక కొత్త డిజైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో రెనాల్ట్ ఈవీ, హైబ్రిడ్ వాహనాలను సైతం అభివృద్ధి చేయాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad