Renault Triber Facelift Launched: రెనాల్ట్ ఇండియా తన ప్రసిద్ధ 7-సీటర్ ట్రైబర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది కారు మొదట 2019లో విడుదల అయింది. అప్పటి నుండి ట్రైబర్ మొదటి ప్రధాన నవీకరణ ఇదే. కొత్త ట్రైబర్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు క్లాస్ కుటుంబానికి బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.30 లక్షలు. కాగా, దీని టాప్ వేరియంట్‌కు రూ. 9.17 లక్షల వరకు ఉంటుంది. ధర పరంగా ఇది దేశంలోనే చౌకైన 7-సీటర్ MPV కూడా. అయితే ఇప్పుడు ఈ కారుకు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆధునిక డిజైన్‌తో వస్తున్న ఈ కారు ముందు భాగంలో కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్, LED DRLలతో సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు అందించారు. అంతేకాకుండా కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, పెద్ద ఎయిర్ డ్యామ్‌ను కలిగి ఉన్న రీప్రొఫైల్ చేయబడిన బంపర్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా, రెనాల్ట్ కొత్త 2D డైమండ్ లోగో ఈ మోడల్‌లో మొదటిసారిగా కనిపిస్తుంది. ఇది దీనికి ప్రీమియం లుక్ అందిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో స్మోక్డ్ LED టెయిల్‌లైట్లు, కొత్త బ్యాడ్జింగ్, నవీకరించబడిన బంపర్ ఉన్నాయి. ఈ మార్పులు ట్రైబర్‌ను మునుపటి కంటే మరింత స్టైలిష్, ఆధునికంగా చేస్తాయి.
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు అయితే చేయలేదు. ఇది అదే 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 72 hp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. డీలర్-స్థాయి ఫిట్‌మెంట్‌గా అందుబాటులో ఉండే CNG వేరియంట్‌ను కూడా రెనాల్ట్ నిలుపుకుంది. పెట్రోల్ వేరియంట్ 19 నుండి 20.5 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
Also Read: Best cars: రూ.8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే..
రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం మునుపటి కంటే మరింత ప్రీమియం, సాంకేతికతతో వస్తోంది. ఇది లైట్ కలర్ థీమ్, కొత్త అప్హోల్స్టరీ, సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లతో పునఃరూపకల్పన చేయబడిన డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. దీనిలో ఇవ్వబడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. మూడవ వరుస సీట్లు తొలగించవచ్చు. అదే ప్లేస్ లో 625 లీటర్ల పెద్ద బూట్ స్థలాన్ని అందిస్తాయి. మూడవ వరుసకు అంకితమైన AC వెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, గ్లోబల్ స్మార్ట్ కీ, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఉన్నాయి. ఈ లక్షణాలు దీనిని బడ్జెట్ విభాగంలో బలమైన పోటీదారుగా చేస్తాయి. భద్రత పరంగా.. దీనికి ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. ఇందులో EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.


