Saturday, June 21, 2025
Homeటెక్నాలజీiPhone 16 Pro: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్..ఈ మోడల్ పై ఏకంగా రూ....

iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్..ఈ మోడల్ పై ఏకంగా రూ. 10 వేల వరకు డిస్కౌంట్..

- Advertisement -


iPhone 16 Pro: ఈ ఏడాదిలో ఆపిల్ నయా మోడల్ ఐఫోన్ 17 సిరీస్ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, ఈ సిరీస్ లాంచ్ కి కొన్ని నెలల ముందు కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లను చౌకగా కొనుగోలు చేసే అవకాశం కలిపిస్తోంది. ఐఫోన్ 16 సిరీస్‌ను వివిధ ఆఫర్‌లతో చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఐఫోన్ 16 ప్రో కొనాలని ఆలోచిస్తుంటే ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ధరపై రూ. 10,000 తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల తర్వాత ఐఫోన్ 16 ప్రో ను మరింత తక్కువ ధరకు కొనొచ్చు. ఐఫోన్ 16 ప్రో కు సంబంధించి బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురుంచి వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ప్రో ధరపై తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 128 GB స్టోరేజ్ వేరియంట్ 8 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 1,19,900 ధరతో ఉన్న ఐఫోన్ 16 ప్రో రూ. 10000 తగ్గింపు తర్వాత కేవలం రూ. 1,09,900 ధరకే కొనుగోలు చేయొచ్చు.

బ్యాంక్ ఆఫర్లు

బ్యాంక్ ఆఫర్ ద్వారా మరిన్ని డిస్కౌంట్‌లతో ఐఫోన్ 16 ప్రోను కొనుగోలు చేయవచ్చు. డెబిట్-క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు UPI చెల్లింపుపై డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అయితే, EMI కాని లావాదేవీలపై రూ. 2000 తగ్గింపు పొందవచ్చు. అన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3000 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్

ఆపిల్ ఐఫోన్ 16 ప్రోను ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48,150 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్ఛేంజ్ పై దాదాపు రూ. 3000 అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇటువంటి తగ్గింపు పొందడానికి, ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ డ్యామేజ్ కాకుండా ఉండి, అప్డేట్ మొబైల్ అయి ఉండాలి.


ఐఫోన్ 16 ప్రో కీ స్పెక్స్

డిస్ప్లే: 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR
వెనుక కెమెరా: 48MP + 48MP + 12MP
ముందు కెమెరా: 12MP
ప్రాసెసర్: A18 ప్రో చిప్, 6 కోర్ ప్రాసెసర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News