Samsung Galaxy A55 5G Discount: అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసింది. అయినప్పటికీ కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న డీల్స్ అలానే ఉన్నాయి. ఇవి ఇప్పటికీ ప్లాట్‌ఫామ్‌లో వాటి అత్యల్ప ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఈ పరికరం ఉత్తమ ఎంపిక అవుతుంది. ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్
కంపెనీ గత సంవత్సరం రూ.39,999 ప్రారంభ ధరకు శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G పరికరాన్ని లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు దీన్ని రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత అమెజాన్ నుండి కేవలం ₹23,999కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా, కంపెనీ ఈ ఫోన్‌పై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కాకపోతే ఎక్స్ఛేంజ్ వాల్యూ పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G పరికరం 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ పరికరం శక్తివంతమైన ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAM, 256GB అంతర్గత నిల్వతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే..ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ పరికరం 5000mAh బిగ్ బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.


