Samsung Galaxy A55 5G: మీరు ప్రీమియం ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఇప్పుడు దీని చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో దాదాపు రూ.39,999 ధరకు విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇప్పుడు అమెజాన్‌లో రూ.16,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ పరికరం ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం అమెజాన్ లో ఈ ఫోన్‌ను రూ.16,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.23,999కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. అమెజాన్ పేతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.719 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా, ఈ పరికరం పై రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. కాకపోతే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్ల విషయానికి వస్తే..శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని 8GB/12GB RAM, 128GB/256GB నిల్వతో జత చేశారు. ఇది శామ్‌సంగ్ One UI లేయర్‌తో ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. ఫోన్ నాలుగు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ నవీకరణలతో వస్తుంది. కెమెరా పరంగా.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా (OISతో), 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ లేదా 5MP థర్డ్ లెన్స్ (వేరియంట్‌ను బట్టి). ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


