Iphone 15 Discount In Amazon: ఐఫోన్ కు అదే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అయితే మీరు కూడా చాలారోజుల నుంచి ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకోసమే! అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 15పై గణనీయమైన ధర తగ్గింపును అందిస్తోంది. ఇండియాలో ఈ ఫోన్ రూ.69,900 ధరకు మార్కెట్లో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ.51,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 2023లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పటికీ రూ.55,000లోపు అత్యుత్తమ ప్రీమియం ఫోన్‌లలో ఒకటి. ఇటువంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. కాబట్టి ఐఫోన్ 15ను కొనాలని చూస్తుంటే, ఇదే సరైన అవకాశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.
డీల్
అమెజాన్‌లో ఐఫోన్ 15 అసలు ధర రూ.69,900. అయితే, అమెజాన్ ప్రస్తుతం గ్రీన్ (128 GB) వేరియంట్‌పై ఏకంగా రూ.18,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.50,990కి తగ్గుతుంది. అదనంగా, వినియోగదారులు తమ పాత ఫోన్‌ను రూ.48,150 వరకు డిస్కౌంట్‌తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అదనంగా కస్టమర్లకు EMI, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా పొందవచ్చు.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే..ఐఫోన్ 15 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, HDR10 వంటి అధిక-నాణ్యత వీక్షణ ప్రమాణాలకు మద్దతు ఇస్తుంది. దీని గరిష్ట ప్రకాశం 2000 నిట్‌లను చేరుకుంటుంది. ఈ ఫోన్ ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6GBRAM+512GB వరకు నిల్వతో జత చేశారు. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే..ఐఫోన్ 15 డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది డెడికేటెడ్ లెన్స్‌గా పనిచేసే 2x ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ముందు కెమెరా 12MP కెమెరా, ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌లకు గొప్పది. బ్యాటరీ పరంగా..ఇది వైర్‌లెస్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ రెండింటికీ మద్దతు ఇచ్చే 3349mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ ఒకే ఛార్జ్‌పై 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని ఆపిల్ చెబుతోంది. ఫోన్ IP68 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇది దుమ్ము, స్ప్లాష్ నిరోధకతను కలిగిస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


