Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSamsung Galaxy Z Fold 6 Discount: ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 63,000...

Samsung Galaxy Z Fold 6 Discount: ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 63,000 డిస్కౌంట్..ఇప్పుడే త్వరపడండి!

Samsung Galaxy Z Fold 6: మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకోసమే! అమెజాన్ ప్రస్తుతం తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దీపావళి స్పెషల్ ఎడిషన్‌ను నిర్వహిస్తోంది.ఈ సేల్ లో గృహోపకరణాల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదానిపై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 భారీ తగ్గింపును అందుకుంటోంది. ఈ ఫోల్డబుల్ పరికరం ఏకంగా రూ.63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది ఈ సేల్‌లో అతిపెద్ద డీల్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ పరికరం పై ఆఫర్‌లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

డీల్: 

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఇండియాలో రూ.1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం ఈ పరికరంపై రూ.61,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ. 1,03,999కు అందుబాటులో ఉంది. అదనంగా, ఈ పరికరం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ EMI (ఈఎంఐ) లావాదేవీలపై రూ.2,000 వరకు తగ్గింపును కూడా అందిస్తుంది. అంతేకాదు, పాత పరికరాన్ని ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.44,050 వరకు తగ్గింపు పొందవచ్చు. కాకపోతే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఫోన్ కండిషన్, బ్రాండ్ వేరియంట్‌ను బట్టి ఉంటుందని గుర్తించుకోండి!

ఫీచర్లు:

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 బయట 6.3-అంగుళాల అమోలేడ్ కవర్ డిస్‌ప్లే, లోపల 7.6-అంగుళాల లోపలి అమోలేడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. ఈ పరికరాన్ని శక్తివంతం చేయడం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ను అందించారు. ఈ ఫోన్ 12GBRAM, 512GB అంతర్గత నిల్వతో జత చేశారు. కెమెరాల విషయానికొస్తే, ఈ పరికరం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. డ్యూయల్ ఫ్రంట్ కెమెరాల కోసం 10మెగాపిక్సెల్, 4మెగాపిక్సెల్. బ్యాటరీ కోసం ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad