Vivo X200 Pro 5G Discount: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాతో! అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ బ్రాండ్ వివో X సిరీస్ ప్రీమియం ఫోన్ అయిన వివో X200 ప్రో 5G మరోసారి గొప్ప ధరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్ల వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆఫర్:
వివో X200 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 16GBRAM+512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర అమెజాన్ ఇండియాలో రూ. 94999. ఈ ఫోన్ మరోసారి రూ. 7 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫోన్‌పై ఇవ్వబడిన ఈ గొప్ప ఆఫర్ సెప్టెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ. 4749 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ రూ. 42350 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ వివో ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. టైటానియం గ్రే, కాస్మోస్ బ్లాక్.
Also Read: SmartPhones: రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..
ఫీచర్లు:
వివో X200 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో అందించబడుతున్న ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని సపోర్ట్ చేస్తుంది. వివో నుండి వచ్చిన ఈ ప్రీమియం పరికరం 16GB LPDDR5x RAM, 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ప్రాసెసర్‌గా ఫోన్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఇక ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలు అందించారు.
ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇదే సమయంలో సెల్ఫీ కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP69 + IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


