Xiaomi Pad 7 Discount: ప్రస్తుతం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 కొనసాగుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు ఈ సేల్ సమయంలో టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, చాలా గొప్ప డీల్స్ ఉన్నాయి. షావోమి టాబ్లెట్ మోడల్ దాని లాంచ్ ధర కంటే ఏకంగా రూ.7,000 తగ్గింపుతో కొనుగోలుకు ఉంది. ఇతర బ్రాండ్‌ల నుండి టాబ్లెట్‌లు కూడా సేల్ సమయంలో వాటి అత్యల్ప ధరలకు అందుబాటులో ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపులు, ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకుని, బ్రాండ్ టాబ్లెట్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, వెంటనే ఈ డీల్ ఉత్తమ ఎంపిక అవుతుంది.
షావోమి ప్యాడ్ 7 టాబ్లెట్ మార్కెట్లో రూ.27,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ టాబ్లెట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. సేల్‌లో రూ.20,999 ప్రభావవంతమైన ధరకు లిస్ట్ అయింది. అంతే దీని అర్థం ఈ టాబ్లెట్ పై ఏకంగా రూ.7000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు ఈ టాబ్లెట్ లో కొనుగోలులో ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ట్యాబ్ 11.2-అంగుళాల 3.2K LCD డిస్ప్లే, డాల్బీ అట్మాస్‌తో కూడిన క్వాడ్ స్పీకర్ సిస్టమ్, ఏఐ ఫీచర్లు (ఏఐ రైటింగ్, ఏఐ లైవ్ సబ్‌టైటిల్‌లు వంటివి) ఉన్నాయి. పనితీరు కోసం ఇందులో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్‌సెట్ అమర్చారు. కెమెరా విషయానికి వస్తే ఈ టాబెల్ట్ లో 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8850mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇండియాలో ఈ టాబ్లెట్ లాంచ్ సమయంలో 8GB+128GB వేరియంట్ ధర రూ. 27,999గా 12GB+256GB వేరియంట్ ధర రూ. 30,999గా ఉన్నాయి. ఇది గ్రీన్, పర్పుల్, గ్రే రంగులలో లభిస్తోంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


