Nissan Magnite Car Discount: కొద్ది రోజుల్లోనే కొత్త SUVని కొనుగోలు చేయాలనుకుంటే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రసిద్ధ SUV మాగ్నైట్‌పై బంపర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తమ కస్టమర్లు ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.86,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. అయితే కంపెనీ ఇటీవల 2 లక్షల యూనిట్ల SUV అమ్మకాల మైలురాయిని దాటిన సందర్భంగా ఈ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ ధర, ఫీచర్ల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే.. ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 72bhp శక్తిని, 96Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక రెండవది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది మాత్రం గరిష్టంగా 100bhp శక్తిని, 160Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా,ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. కారు క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు, కారు లోపలి భాగంలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో భద్రత కోసం.. నిస్సాన్ మాగ్నైట్‌లో 6-ఎయిర్‌బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్ల ను అందించారు.
నిస్సాన్ మాగ్నైట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 6.14 లక్షల నుండి రూ. 11.76 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు మార్కెట్లో నేరుగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి SUV లతో పోటీపడుతుంది.