Motorola Edge 50 Pro Discount: కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా..?అయిత్ మీకో గుడ్ న్యూస్! మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ టాప్-వేరియంట్ అసలు లాంచ్ ధర కంటే ఎంతో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో దీని 12GB ర్యామ్+256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 35999. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ దాదాపు రూ.9 వేల రూపాయల తగ్గింపుతో అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 26,994 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
అంతేకాదు, సెప్టెంబర్ 10 వరకు ఫోన్‌పై రూ. వెయ్యి వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 1349 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 25,200 వరకు చౌకగా ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు డిస్కౌంట్ పాత ఫోన్, బ్రాండ్, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 6.7-అంగుళాల 1.5K పోల్డ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం, కంపెనీ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ 5ని కూడా అందిస్తోంది. స్టోరేజ్ కు వస్తే, ఫోన్ 12GB వరకు LPDDR4x RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3ని అమర్చారు.
ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రధాన OIS లెన్స్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ఆటోఫోకస్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 4500mAh బ్యాటరీతో 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, 10 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో అందించారు. ఈ మోటరోలా ఫోన్ IP68 వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


