Samsung First AI Powered TV App Launch: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శామ్‌సంగ్ తన స్మార్ట్ టీవీ యూజర్ల కోసం ఒక వినూత్నమైన యాప్‌ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి AI-పవర్డ్ టీవీ యాప్‌గా పేరొందిన పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇది శామ్‌సంగ్ ‘విజన్ AI కంపానియన్’కు నెక్ట్స్ వెర్షన్‌గా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ టీవీలోనే వేగంగా సమాచారాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, వినోదాన్ని మరింత ఆస్వాదించడానికి ఈ యాప్ అద్భుతంగా సహాయపడుతుంది.
𝐒𝐚𝐦𝐬𝐮𝐧𝐠 𝐁𝐫𝐢𝐧𝐠𝐬 𝐏𝐞𝐫𝐩𝐥𝐞𝐱𝐢𝐭𝐲 𝐀𝐈 𝐭𝐨 𝐒𝐦𝐚𝐫𝐭 𝐓𝐕𝐬 𝐭𝐨 𝐌𝐚𝐤𝐞 𝐇𝐨𝐦𝐞 𝐕𝐢𝐞𝐰𝐢𝐧𝐠 𝐒𝐦𝐚𝐫𝐭𝐞𝐫 𝐚𝐧𝐝 𝐄𝐚𝐬𝐢𝐞𝐫
Samsung Smart TVs just got smarter! Meet the new Perplexity AI app — ask, explore, and discover in seconds!
Samsung is taking… pic.twitter.com/LJ4enW3xkC
— Analytics Insight (@analyticsinme) October 22, 2025
పెర్‌ప్లెక్సిటీ AI అంటే ఏంటి?
పెర్‌ప్లెక్సిటీ అనేది ఒక అధునాతన AI-ఆధారిత ఇన్ఫర్మేషన్ ఇంజిన్. ఈ యాప్ మనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి సెకన్లలో అందిస్తుంది. కేవలం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడమే కాకుండా.. యూజర్లు మరింత లోతుగా సమాచారాన్ని తెలుసుకోవడానికి, కొత్త ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. శామ్‌సంగ్ టీవీలలో దీనిని ఉపయోగించినప్పుడు.. యూజర్లు అడిగే ప్రశ్నలకు AI జవాబులు, సంబంధిత సూచనలు అందజేస్తుంది.
పెర్‌ప్లెక్సిటీ AIని ఎలా ఉపయోగించాలి?
పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్‌ను టీవీ హోమ్ స్క్రీన్ నుంచి లేదా ‘విజన్ AI కంపానియన్’లోని AI బటన్ ద్వారా ఓపెన్ చెయవచ్చు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ అప్‌కమింగ్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాలు, వాటి దర్శకుల గురించి తెలుసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ లేదా రోజువారీ పనులకు సంబంధించిన సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ సమయంలో AI వాయిస్ కమాండ్‌లను ఉపయోగించే ముందు, యూజర్లు యాప్ షరతులను అంగీకరించి, మైక్రోఫోన్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆన్-స్క్రీన్ కీబోర్డ్ లేదా యూఎస్‌బీ కీబోర్డ్ ద్వారా కూడా వెతకవచ్చు. పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. మనం అడిగే ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను బిగ్ టీవీ స్క్రీన్‌లకు అనుగుణంగా హై క్వాలిటీ గల కార్డ్‌ల రూపంలో కనిపిస్తాయి. ఇది కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా, ఇంటరాక్టివ్ (పరస్పర చర్య), ఆకర్షణీయమైన అనుభవాన్ని అందిస్తుంది.
పెర్‌ప్లెక్సిటీకి ఉచిత సబ్‌స్క్రిప్షన్..
ఈ పెర్‌ప్లెక్సిటీ టీవీ యాప్ అన్ని 2025 సామ్‌సంగ్ టీవీలలో అందుబాటులో ఉంది. 2023, 2024 మోడళ్ల టీవీ యూజర్లు ఓఎస్ అప్‌గ్రేడ్ తర్వాత ఈ యాప్‌ను పొందవచ్చు. అదనంగా సామ్‌సంగ్ యూజర్లందరికీ 12 నెలల పెర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు యాప్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ కొత్త AI యాప్‌తో సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ అనుభవం మరింత స్మార్ట్‌గా మారుతుందని కంపెనీ పేర్కొంది.


