Samsung Galaxy A17 5G Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ తన కస్టమర్ల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉండగా, తాజాగా కంపెనీ భారతీయ మార్కెట్లో పరిచయం చేసింది. కంపెనీ దీని శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G పేరిట తీసుకొచ్చింది. ఈ పరికరం ఇండియాలో కూడా గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఉంది. 5000mAh బ్యాటరీ, ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ పరికరం కేవలం రూ. 20 వేల కంటే తక్కువ ధరలో ఉండటం విశేషం. అంతేకాదు, ఇందులో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Samsung Galaxy A17 5G: ధర
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది.
6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999
8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499
8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,499.
Samsung Galaxy A17 5G: లభ్యత
ఈ ఫోన్ ఇప్పటికే శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్ట్ అయి ఉంది. ఇది బ్లాక్, బ్లూ నీలం,గ్రె వంటి రంగులలో లభిస్తోంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. కస్టమర్లు లాంచ్ ఆఫర్ కొంద SBI, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో శామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా EMI లావాదేవీలపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
Samsung Galaxy A17 5G: ఫీచర్లు
డ్యూయల్-సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ పరికరం, 6.7-అంగుళాల ఫుల్-HD + స్క్రీన్ తో వస్తుంది. 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, ఇన్ఫినిటీ-U సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ ఇన్-హౌస్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్ అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 8GB RAM+ 256GB వరకు ఆన్‌బోర్డ్ నిల్వతో జత చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ ఆరు సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లు, భద్రతా నవీకరణలు పొందుతుందని కంపెనీ చెబుతోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం, కొత్త గెలాక్సీ A17 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ పరంగా.. ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, NFC, OTG, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డస్ట్, వాటర్ నీటి రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP54 రేటింగ్‌ను పొందింది. దీని మందం 7.5 మిమీ. బరువు 192 గ్రాములు.


