Samsung Galaxy A27 5G arrives in the Indian market: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్, భారత మార్కెట్లోకి మరో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘గెలాక్సీ ఏ27 5జీ’ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లు, లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ అమ్మకాలు జూలై 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేసింది. ఇక, ధరల విషయానికి వస్తే.. గెలాక్సీ ఏ27 5జీ బేస్ వేరియంట్ (6 బీజీ ర్యామ్ + 128 జబీ స్టోరేజ్) ధర రూ. 28,999గా నిర్ణయించింది. బ్యాంక్ లేదా యూపీఐ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద రూ. 3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్, లైట్ పింక్, బ్లాక్ ఆర్షన్లలో లభిస్తుంది. శాంసంగ్ అధికారిక స్టోర్లు, భాగస్వామ్య రిటైల్ స్టోర్లు, శాంసంగ్.కామ్ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈజీ ఫైనాన్సింగ్ కోసం 15 నెలల వరకు జీరో డౌన్-పేమెంట్ ఈఎంఐ స్కీమ్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ద్వారా 24 నెలల ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.
Also Read: Bandi Bhagirath: హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్.. రేపటి విచారణపై తీవ్ర ఉత్కంఠ..!
ఆరేళ్ల పాటు ఉచితంగా సెక్యూరిటీ అప్‌డేట్స్..
శాంసంగ్ గెలాక్సీ ఏ27 5జీ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్, వీడియో వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. దీని డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈ ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్, గేమింగ్, ఏఐ అప్లికేషన్ల పర్ఫార్మెన్స్‌ను వేగవంతం చేస్తుంది. ఇక, కెమెరా విషయానికొస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కలిగిన 50MP ప్రధాన సెన్సార్, 115 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరా వంటివి అమర్చింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 ఎంపీ కెమెరాను అమర్చింది. ఈ ఫోన్‌లో ‘సర్కిల్ టు సెర్చ్’, ‘వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్’, ‘ఆబ్జెక్ట్ ఎరేజర్’ వంటి పలు అట్రాక్టివ్ ఏఐ ఫీచర్లను శాంసంగ్ ఇంటిగ్రేట్ చేసింది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. ఆరేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, వన్ యూఐ అప్‌గ్రేడ్‌లతో పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. శాంసంగ్ నాక్స్, నాక్స్ వాల్ట్ వంటి ఫీచర్లతో ఫోన్‌కు అడిషనల్ సెక్యూరిటీని కల్పించారు. గెలాక్సీ ఏ26 5జీకి కొనసాగింపుగా, మెరుగైన పనితీరు, ఏఐ ఫీచర్లతో ఈ కొత్త మోడల్‌ను శాంసంగ్ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

