Samsung Galaxy A36 5G Offer: మీరు చాలారోజుల నుంచి శామ్‌సంగ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో శామ్‌సంగ్ గెలాక్సీ A36 5G చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ దాని లాంచ్ ధర కంటే రూ. 5,000 తక్కువ ధరకు లభిస్తుంది. అదనంగా దీని క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ సమయంలో ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. ఇప్పుడు, ఈ వేరియంట్ అమెజాన్‌లో రూ.33,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ అదనంగా రూ.3,000 తగ్గింపును కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్‌లతో ఈ ఫోన్‌ను మొత్తం రూ.5,000 తక్కువకు పొందవచ్చు. ఈ ఫోన్ పై రూ.1,699 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధరను మరింత తగ్గిస్తుంది. కాకపోతే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, మోడల్ పై ఆధారపడి ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే..శామ్‌సంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫుల్ HD+ సూపర్ అమోలేడ్ ఇన్ఫినిటీ-O HDR డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 1200 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్+ ద్వారా రక్షణ పొందుతుంది. ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB వరకు అంతర్గత నిల్వతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే..ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా శామ్‌సంగ్ OneUI 7 పై నడుస్తుంది.
ఇక కెమెరా గురించి మాట్లాడితే..ఫోన్ ప్రధాన కెమెరా OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ అందించారు. అదనంగా, వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. ఇక 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తోంది. బ్యాటరీ పరంగా..ఇది 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం..ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

