Galaxy A56 5G, Galaxy A36 5G New Colour Variant: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్రాండ్ శామ్‌సంగ్ తన రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను కొత్త రంగు ఎంపికలలో విడుదల చేసింది. కంపెనీ గెలాక్సీ A56 5G, గెలాక్సీ A36 5G లకు కొత్త రంగు ఎంపికలను జోడించింది. గెలాక్సీ A56 5G కి కొత్త అద్భుతమైన పింక్ రంగును, గెలాక్సీ A36 5G కి కొత్త అద్భుతమైన లైమ్ రంగును జోడించింది. అయితే గెలాక్సీ A56 5G ఇప్పటికే అద్భుతం ఆలివ్, లైట్ గ్రే గ్రాఫైట్ రంగులలో లభిస్తోంది. మరోవైపు, గెలాక్సీ A36 5G స్మార్ట్ ఫోన్ కూడా లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో అందుబాటులో ఉంది. ప్రత్యేక విషయం ఏంటంటే? అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రెండు ఫోన్‌లు గణనీయమైన తగ్గింపులతో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
గెలాక్సీ A56 ఫీచర్లు:
గెలాక్సీ A56 5G స్టైలిష్, దృఢమైన మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందించారు. పనితీరు కోసం ఇందులో ఎక్సినోస్ 1580 చిప్‌సెట్ ను అమర్చారు. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో OISతో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది గెలాక్సీ ఏఐ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ పరికరం రూ.35999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
గెలాక్సీ A36 ఫీచర్లు:
అమెజాన్ సేల్ లో ఈ ఫోన్ ధర రూ.28499. శామ్‌సంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గెలాక్సీ ఏఐ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో OISతో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.


