Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSamsung Galaxy Book 4 Edge15: ఏఐ ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్.. ధ‌ర...

Samsung Galaxy Book 4 Edge15: ఏఐ ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్.. ధ‌ర కూడా తక్కువే!

Samsung Galaxy Book 4 Edge 15 Launched: శామ్సంగ్ తమ కస్టమర్ల కోసం ఏఐ కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్ చేసింది. కంపెనీ దీని శామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 15 పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో వస్తోన్న ఈ ల్యాప్ టాప్ ధర త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ AI PC Snapdragon X ప్రాసెసర్ పై నడుస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Samsung Galaxy Book 4 Edge 15 ధర:

శామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ 15 ల్యాప్‌టాప్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. దీని ధర రూ. 64,990గా ఉంది. దీని పై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ను ఆర్కిటిక్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లో మాత్ర‌మే లాంచ్ చేశారు.

Samsung Galaxy Book 4 Edge 15 ఫీచర్లు:

ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల పూర్తి HD (1,920 x 1,080 పిక్సెల్స్) యాంటీ-గ్లేర్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఏఐ ల్యాప్‌టాప్‌ లో స్నాప్‌డ్రాగన్ X (X1-26-100) ప్రాసెసర్ అమర్చారు. ఇది 3.0GHz బరస్ట్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ అడ్రినో GPU, 8GB LPDDR5X RAM, 512GB eUFS స్టోరేజ్‌తో వస్తుంది. ఇది AI పనులను నిర్వహించే 40 TOPS NPUని కలిగి ఉంది. ఈ 2-మెగాపిక్సెల్ వెబ్‌క్యామ్, డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ 1.5W స్టీరియో స్పీకర్లు, డ్యూయల్-అర్రే మైక్రోఫోన్‌లు ఉన్నాయి.

Also Read: Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..

కంపెనీ ప్రకారం..ఈ లాప్ ల్యాప్ టాప్ ఒక సర్టిఫైడ్ కోపైలట్+ పిసి, కోక్రియేటర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్కెచ్‌లు, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను AI ఆర్ట్‌వర్క్‌గా మార్చగలదు. ఈ ల్యాప్ టాప్ విండోస్ స్టూడియో ఎఫెక్ట్‌లను కూడా కలిగి ఉంది. ఫలితంగా ఇది వీడియో కాల్‌లకు ఫిల్టర్‌లు, ఐ కాంటాక్ట్ కరెక్షన్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, వాయిస్ ఫోకస్ వంటి ఫీచర్లను తీసుకువస్తుంది.

ల్యాప్‌టాప్ మైక్రోసాఫ్ట్-ఆధారిత స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో లింక్ టు విండోస్, మల్టీ కంట్రోల్, సెకండ్ స్క్రీన్ ఉన్నాయి. ఇది చాట్ అసిస్ట్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి శామ్‌సంగ్ గెలాక్సీ AI లక్షణాలను కూడా పొందుతుంది.

ఈ ల్యాప్‌టాప్ ఒకే ఛార్జ్‌లో 27 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 61.5Wh బ్యాటరీ ఉండగా, 65W USB టైప్-C పవర్ అడాప్టర్‌ ను అందిస్తున్నారు. కనెక్టివిటీ పరంగా..ఇది HDMI 2.1, USB 3.2 టైప్-A, USB 4.0 టైప్-C పోర్ట్, మైక్రో SD కార్డ్ రీడర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని కొలతలు 356.6 x 229.75 x 15.0 mm. దీని బరువు 1.5 కిలోలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad