Samsung Galaxy F06 5G Discount: బడ్జెట్ ధరలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్క కార్ట్ లో శామ్‌సంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ పరికరానికి కొనడానికి ఇదే సువర్ణావకాశం. ఈ స్మార్ట్ ఫోన్ 50MP కెమెరా సెటప్, బిగ్ 5000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మద్దతును కలిగి ఉంది. ఈ క్రమంలో శామ్‌సంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ పై అందుబాటులో ఉన్న ఆఫర్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఆఫర్:
శామ్‌సంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 9,499. కానీ ప్రస్తుతం ఈ ఫోన్ రూ.1000 డైరెక్ట్ డిస్కౌంట్ తర్వాత రూ.8,499కి అందుబాటులో ఉంది. దీనితో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇది ఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. ఈ ఫోన్ జాడే గ్రీన్, ట్విలైట్ బ్లూ అనే రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ SBI కార్డ్ ద్వారా ఈ పరికరాన్ని కొనుగోలు చేస్తే , రూ.425 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. దీనితో పాటు పాత ఫోన్ మోడల్‌ను బట్టి ఫోన్‌పై రూ.5000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుకోవచ్చు.
Also Read:Samsung Galaxy Tab S10 Lite: 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్10 లైట్ విడుదల..
ఫీచర్లు
ఈ పరికరం 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.6-అంగుళాల FHD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫలితంగా ఇది స్క్రోలింగ్, వీడియో, గేమింగ్ కోసం సున్నితంగా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది రోజువారీ పనులు, మిడ్-రేంజ్ గేమింగ్‌కు మంచి పనితీరును అందిస్తుంది.
సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 6.1పై నడుస్తుంది. ఈ పరికరం 4 సంవత్సరాల పాటు OS నవీకరణలను, 5 సంవత్సరాల పాటు భద్రతా నవీకరణలను పొందుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. స్టోరేజ్ ఎంపికలో 4GB, 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. దీనిని మైక్రో SD కార్డ్‌తో విస్తరించవచ్చు.
ఇక కెమెరా గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం..13MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ పరంగా కూడా శక్తివంతమైనది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.


